ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ .. శాసనమండలి రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించింది. రాజ్యాంగంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 (1) ప్రకారం.. మండలిని రద్దు చేస్తున్నట్లుగా తీర్మానం చేశారు. తీర్మానికి మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండాలన్న నిబంధన ఉండటంతో… విపక్షపార్టీల సభ్యులు ఎవరూ లేకపోయినప్పటికీ.. ఓటింగ్ నిర్వహించారు. మొత్తంగా వైసీపీ సభ్యులు 133 మంది సభలో ఉన్నారు. వారందరూ.. మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 133 మంది ఎమ్మెల్యేలు తీర్మానికి మద్దతిచ్చారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. కేంద్రం ఈ తీర్మానాన్ని బిల్లుగా మార్చి ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.
మండలి రద్దు విషయంలో..రాజ్యాంగం… అసెంబ్లీలో పూర్తి అధికారం ఇచ్చారని.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానంపై మాట్లాడుతూ.. వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్దేశం ప్రకారం.. శాసనమండలి ఇక రద్దు అయిపోయినట్లేనని.. ఎలాంటి వ్యవహారాలు చేపట్టాల్సిన పనిలేని ఆయన భావిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నారు. మండలి చైర్మన్ షరీఫ్.. ఇప్పటికే సెలక్ట్ కమిటీ పని ప్రారంభించారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు పై సెలక్ట్ కమిటీని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అసెంబ్లీ రద్దు తీర్మానం చేయడంతో.. ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
సాంకేతికంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి..గెజిట్లో ప్రకటించిన తర్వాతే మండలి రద్దవుతుంది. అప్పటి వరకూ మండలి కార్యకలాపాలు జరగాలి. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం చూస్తే.. మండలి ఇక లేదన్నట్లుగా.. ఇక కార్యకలాపాలు అవసరం లేదన్నట్లుగా.. ముఖ్యమంత్రి మాట్లాడటంతో.. అధికార వర్గాలు .. మండలి చైర్మన్కు సహకరిస్తాయా.. అన్నది ఆసక్తికరంగా మారింది.