శాసమండలి రద్దు కోసం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి గురించి బయట పెట్టలేదు కానీ.. అందులో ఓ కీలక నిర్ణయం.. విజయవాడలో చినజీయర్ ట్రస్ట్‌కు 40ఎకరాలు కేటాయించాలని నిర్ణయించడం. విజయవాడలో ఈ భూములు కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయం గురించి ప్రభుత్వం పెద్దగా బయటకు రానివ్వలేదు. ఎంత మొత్తానికి.. కేటాయిస్తున్నారు. ఏ అవసరాలకు కేటాయిస్తున్నారన్నదానిపై స్పష్టత లేదు. కానీ చినజీయర్ ట్రస్ట్‌కు మాత్రం 40 ఎకరాలు కేటాయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
చినజీయర్ స్వామికి.. సీతానగరం వద్ద ఓ ఆశ్రమం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు.. గురువు లాంటి చినజీయర్ స్వామి.. సహజంగానే.. జగన్‌కు కూడా.. ఆప్తుడిగా మారారు. ఎన్నికలకు ముందు పలుమార్లు చినజీయర్ ను కలిసి.. జగన్ ఆశీస్సులు తీసుకున్నారు కూడా. ప్రభుత్వం ఇప్పటి వరకూ.. స్వామిజీలకు.. భూములు కేటాయించిన చరిత్ర లేదు. తెలంగాణ సర్కార్ మాత్రం.. స్వరూపానందకు.. చినజీయర్ ట్రస్ట్ కు ఇటీవలి కాలంలో భూములు కేటాయించింది. ఆ క్రమంలో.. జగన్మోహన్ రెడ్డి కూడా చినజీయర్ ట్రస్ట్‌కు 40 ఎకరాలు కేటాయించారు. విజయవాడ శివార్లలో అయినా ఎకరం నాలుగైదు కోట్లకు తక్కువ కాకుండా ఉంటుంది. మరి ఎంత మొత్తానికి ఈ భూములు కేటాయించారో తెలియాల్సి ఉంది.
సాధారణంగా ప్రజాప్రయోజనాలు .. పరిశ్రమలు ఇలాంటి వాటికి మాత్రమే ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. ఇప్పుడు స్వామిజీలకు కూడా.. కేటాయించడం ప్రారంభమయింది. స్వరూపానంద కూడా… కృష్ణానది ఒడ్డున ఓ పెద్ద ఆశ్రమం కట్టుకోవడానికి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. బహుశా… చిరజీయర్ కు మొక్కు తీర్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి.. స్వరూపానందకు కూడా ప్రభుత్వ స్థలాలను కాకుకగా ఇస్తారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.