వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ… ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్లో సంచలన విషయాలు ఉన్నాయి. అఫిడవిట్లో తనకు కొందరిపై అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. వారి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయాల్సి వచ్చిందో కూడా అఫిడవిట్లో వివరించారు. సునీత పేర్కొన్న జాబితాలో ఉన్న పేర్లు: వాచ్‌మన్ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ మనోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. తండ్రి మృతి చెందిన విషయం తనకు ఎలా తెలిసింది.. ఆ సమయంలో.. దారుణమైన హత్యను.. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం ఎలా చేశారన్న వివరాలను.. సునీత అఫిడవిట్లో న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు. ఘటనా స్థలంలో ఉన్నవారి, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత… తమకు కొందరిపై అనుమానాలున్నాయని జాబితాను కోర్టుకు సమర్పించారు. వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐ విచారణ జరిపించాలని… గతంలో తన సోదరుడు జగన్, తల్లి సౌభాగ్యమ్య… హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని సునీత గుర్తు చేశారు.
గవర్నర్‌ను కలిసి కూడా విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కేసు దర్యాప్తు సరిగా జరగడంలేదని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో,.. ఏపీ పోలీసులపై నమ్మకంలేదని అప్పట్లో చెప్పి… ఇప్పుడు మరలా అదే పోలీసులతో దర్యాప్తు జరపగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 3 సిట్ టీమ్‌లు ఏర్పాటు చేసినా దర్యాప్తు కొలిక్కి రావడంలేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు.. రాజకీయ ప్రత్యర్థులని.. ఆ కోణంలో వారిని కూడా అనుమానితులుగా పేర్కొన్నారు సునీత. మిగతా వారిపై… అనేక సందేహాలు వ్యక్తం చేశారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం… కేసు వద్దని ఒత్తిడి చేయడం.. వివేకా రాసినట్లుగా ఓ లెటర్‌ను క్రియేట్ చేయడం… సాక్ష్యాలు తుడిచేయడం.. ఇలా ప్రతీ విషయంలోనూ.. స్పెసిఫిక్ గా కొంత మందిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు మూడు రకాల సిట్లు వేసి.. కావాలనే విచారణ ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేశారు.
వాచ్మెన్ ఇంట్లో ఎలాంటి అరుపులు వినిపించలేదని చెబుతున్నారని.. అంత తీవ్రమైన హత్య జరిగినప్పుడు.. అదెలా సాధ్యమవుతుందన్నారు. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే వైఎస్ జగన్, సౌభాగ్యమ్మ, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి పిటిషన్లు వేసి ఉన్నారు. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు.. విచారమ కీలక దశలో ఉందని ఈ సమయంలో… సీబీఐ విచారణ అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ పోలీసుల తీరు మాత్రం వివాదాస్పదమయింది. దాదాపుగా 1500 మంది అనుమానితులుగా పేర్కొన్నారు. తాజా విచారణలో ఏజీ అందుబాటులో లేరని… వివరాల సమర్పణకు గడువు కోరిన ప్రభుత్వ లాయర్ విజ్ఞప్తి చేయడంతో.. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ … కలకలం రేపుతోంది. ఓ వైపు జగన్మోహన్ రెడ్డి..సీబీఐ విచారణ అవసరం లేదని.. ప్రభుత్వం తరపున వాదిస్తూంటే… సునీత మాత్రం.. సీబీఐ విచారణ కావాలని.. కోరడం… సంచలనం సృష్టిస్తోంది.