విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేసే విషయంలో.. ప్రపంచంలో ఎవరు అడ్డు వచ్చినా వెనక్కి తగ్గేదే లేదని.. విజయసాయిరెడ్డి బీభత్సమైన స్టేట్మెంట్ను విశాఖ గడ్డపై నుంచి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో.. మోడీ, షాలకు ఫిర్యాదు చేసైనా సరే.. మూడు రాజధానులను అడ్డుకుంటామని.. టీడీపీ ప్రకటనలు చేస్తున్న సమయంలో.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రపంచంలో ఎవరు అడ్డొచ్చిన… మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదని .. కొంతమంది వ్యక్తులు… కావాలనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు..అది సాధ్యం కాదని తేల్చేశారు. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమో తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
సుజనా చౌదరి భూములు పోతాయని ఆయన వ్యతిరేకమని.. చంద్రబాబు, సుజనా చౌదరి కలిసి వ్యతిరేకిస్తున్నారని విశ్లేషించారు. అయితే.. ఇతర బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని మాత్రం… ఆయన చెప్పడానికి వెనుకాడారు. బహుశా… కేంద్రం అడ్డు పుల్ల వేసినా.. ఆపబోమని చెప్పడమే.. విజయసాయిరెడ్డి ఉద్దేశం కావొచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తుల షరతు అమరావతిని కాపాడటమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో.. బీజేపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకమన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఏపీ బీజేపీ మొత్తంగా.. తమ అభిప్రాయాన్ని తీర్మానంగా చేసి.. జాతీయ నాయకత్వానికి పంపారు.
అదే సమయంలో.. మూడు రాజధానులు తుగ్లక్ నిర్ణయమని… కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. సుజనా చౌదరి కూడా.. కేంద్రం చూస్తూ ఊరుకోదని.. జోక్యం చేసుకుంటుందని హెచ్చరికలు చేస్తూ వస్తున్నరు. ఈ క్రమంలో… విజయసాయిరెడ్డి… ఓ అడుగు ముందుకేశారు. ఎవరు అడ్డుకున్నా.. ఆగబోమని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి వ్యవహారం బీజేపీ వర్గీయుల్లోనూ చర్చనీయాంశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.