వైఎస్ జగన్ కుటుంబంలో విబేధాలు బయట పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలంటూ… వివేకా కుమార్తె.. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటికే.. చర్చనీయాంశం అయింది. ఇందులో.. దగ్గరి బంధువులు అయిన వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహన్ రెడ్డిలతో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. సునీత ఆరోపణలు సంచలనం సృష్టిస్తూండగానే.. తాజాగా ఆమె .. తమ కుటుంబానికి… అలాగే.. కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న కొంత మందికి ప్రాణహాని ఉందని కోర్టును పోలీసులకు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఇందులో తనకు తన భర్త రాజశేఖర్ రెడ్డి తో పాటు.. కేసులో అత్యంత కీలకంగా ఉన్న వాచ్మెన్ రంగయ్య, ఎర్రగంగిరెడ్డిలతో పాటు మరికొంత మంది ప్రాణహాని ఉందని.. వారందరికీ రక్షణ కల్పించాలని పోలీసులకు లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.
సునీత హైకోర్టులో వేసిన పిటిషన్పైనే ఇప్పుడు వైఎస్ జగన్ కుటుంబంలో అసహనం కనిపిస్తోంది. కుటుంబసభ్యులపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏమిటన్న చర్చ ఓ వైపు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను కూడా.. సునీత లెక్క చేయడం లేదనే ఆగ్రహం మరో వైపు ఉన్నాయని.. అంటున్నారు. అయితే.. ఈ విషయంలో.. ఎవరి ఒత్తిడిని లెక్క చేయకూడదన్న ఉద్దేశంలో.. వివేకా కుటుంబసభ్యులు ఉన్నారు. తండ్రి హత్య ఘటన తర్వాత.. తనపై ఒత్తిడి తెచ్చి రాజకీయ పరమైన ఆరోపణలు కూడా చేయించారని.. కానీ ఇప్పుడు.. పరిస్థితులు చూస్తూంటే.. సొంత కుటుంబంలోనే కుట్ర చేశారన్న విషయం స్పష్టమవుతోందని.. సునీత కుటుంబసభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి వైఎస్ సోదరుల్లో… కొన్నాళ్ల నుంచి సఖ్యత లేదన్న ప్రచారం పులివెందులలో ఉంది. వైఎస్ వివేకా.. తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాల్సిందేనని.. పట్టుబట్టారని..అయితే.. వైఎస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి.. దీనికి ఒప్పుకోలేదని అంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి.. . స్వయంగా వివేకా సోదరుడు. గతంలో ఇద్దరూ కలిసి వ్యాపారాలు చేశారు. వ్యాపారాల్లో వివాదాలు వచ్చి విడిపోయారు. అప్పట్నుంచి మాట్లాడుకోరని అంటారు. ఓ సారి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి ముందు.. ట్రాక్టర్లతో దిగ్భందించి.. వైఎస్ వివేకా ఆందోళన చేయడం కూడా కలకలం రేపింది. ఈ క్రమంలో.. వైఎస్ వివేకా హత్య కేసు… కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనపిస్తోంది.