ప్రపంచకప్ ఫైనల్లో.. సూపర్ ఓవర్లో సాధించిన వివాదాస్పద విజయంలో కివీస్ ప్రపంచ చాంపియన్ అయింది. కానీ అలాంటి సూపర్ ఓవర్ ఆటలో చాంపియన్ తామేనని టీమిండియా.. వారికి హామిల్టన్‌లో నిరూపించింది. హామిల్టన్ వన్డేలో.. టీమిండియా టీట్వంటీల్లో తన పట్టు ఏ స్థాయిలో ఉంటుందో.. మరో సారి చూపించింది. సూపర్ ఓవర్ వరకూ సాగిన మ్యాచ్లోచివరి బంతికి సిక్స్ కొట్టి సాధికారిక విజయాన్ని నమోదు చేసింది. ఐటు టీ-ట్వటీల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే…సిరీస్ గెలిచేసింది. మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది.
సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండా 17 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. పదిహేడు పరుగులు ఎలా కొట్టాలా అని ఆలోచించ లేదు. తొలి నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చాయని కంగారు పడలేదు. రోహిత్ శర్మ.. చివరి రెండు బంతుల్ని రెండు సిక్స్‌లుగా మలిచి.. విజయాన్ని గుప్పిట పట్టారు. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు కట్టడి చేయడంతో.. పెద్దగా రాణించలేకపోయారు. రోహిత్ శర్మ మాత్రమే 40 బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశారు. తర్వాత కోహ్లీ 38 పరుగులు చేశారు. చేజింగ్‌లో కివీస్.. జోరుగానే కనిపించింది.
కేన్ విలియమ్సన్.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కి.. పిల్లర్ లా నిలిచాడు. 95 పరుగులు చేశాడు. అయితే..లాస్ట్ ఓవర్లోఅవుటవడంతో.. మలుపు తిరిగింది. విలియమ్సన్ ఔటయ్యే వరకూ.. మ్యాచ్‌పై టీమిండియాకు ఆశలు సన్నగిల్లాయి. ఆ తర్వాత మ్యాచ్‌ను టైగా ముగించడానికి టీమిండియా పెద్దగా కష్టపడలేదు. సూపర్ ఓవర్ వచ్చిన తర్వాత టీమిండియా అసలు కంగారు పడలేదు. టీ ట్వంటీల్లో ఇప్పటి వరకూ కివీస్‌పై ఉన్న చెత్తరికార్డును.. టీమిండియా…తొలగించేసింది.