విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా క్లాస్‌గా ఉంటారేమో కానీ.. పొలిటిషియన్‌గా మాత్రం ఊర మాస్. ఎవరేముకున్నా.. ఎలాంటి సమావేశాలయినా ఆయన రాజకీయ ఎజెండాను అమలు చేస్తూ ఉంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. స్పీకర్ ఆల్ పార్టీ భేటీ ఏర్పాటు చేశారు. చర్చించాల్సిన అంశాలను ఫైనల్ చేయడానికి ఈ సమావేశం సంప్రదాయంగా నిర్వహిస్తారు. అన్ని పార్టీల నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. వాటిని మంత్రులు నోట్ చేసుకుంటారు. చర్చకు వస్తాయా లేదా.. అన్నది తర్వాతి విషయం. గురువారం ఇలా జరిగిన ఓ సమావేశంలో… గల్లా జయదేవ్.. ఏపీ మండలి రద్దు, రాజధాని మార్పులపై చర్చించాలన్నారు. దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడుతూండగానే.. విజయసాయిరెడ్డి కల్పించుకున్నారు.
రాజధాని మార్పు రాష్ట్రానికి సంబంధించిన విషయమని చెబుతూ… గల్లా జయదేవ్ ను మాట్లాడకుండా చేశారు. అమరావతిని గత ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించిన తర్వాతే ఎంపిక చేశారని… అందుకే ఇప్పుడు పార్లమెంట్లో చర్చించాల్సి ఉందన్నారు. అయితే.. వైసీపీ ఎంపీలు మాత్రం.. గల్లా జయదేవ్ కు పదే పదే అడ్డుపడ్డారు. దీంతో.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్… విజయసాయిరెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీల అభిప్రాయాలను ఎందుకు అడ్డుకుంటున్నారని.. సభలో చర్చించాలా లేదా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. చర్చించే అంశాలపై గొడవకు దిగడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాలకు ముందు కూడా.. జరిగిన సమావేశంలో.. చిదంబరం బెయిల్ ఇష్యూలో.. విజయసాయిరెడ్డి అత్యుత్సాహానికి పోయారు.
అప్పట్లో జైల్లో ఉన్న చిదంబరాన్ని.. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా.. చూడాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. దీన్ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చిదంబరానికో న్యాయం.. జగన్‌కో న్యాయమా అంటూ.. హడావుడి చేయబోయారు. అప్పుడు కూడా అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు .. వాళ్ల వాదన వాళ్లు వినిపించారు.. మేం నోట్ చేసుకుంటాం.. మీకొచ్చిన ఇబ్బందేమిటనడంతో సైలెంటయిపోయారు. ఆ చేదు అనుభవం ఎదురైనా… ఇప్పుడు విజయసాయిరెడ్డి తన రూటు మార్చలేదు.