నగరి ఎమ్మెల్యే రోజా తన మార్క్ ఫైర్ బ్రాండ్ రాజకీయాలు ఇప్పుడు.. సొంత పార్టీ నేతలపైనే చూపిస్తున్నారు. నగరి నియోజకవర్గ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. తనకు ఇష్టం లేకపోతే.. సొంత పార్టీ నేతల శుభకార్యాలకు కూడా.. కార్యకర్తలు వెళ్లకూడదని హుకుం జారీ చేస్తున్నారు. కాదు .. కూడదంటే.. ఆమె “టంగ్ పవర్”ని వారు ఫేస్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం.. సొంత పార్టీ నేతల్ని రోజా.. తనదైన శైలిలో తిడుతున్న ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. నగరి నియోజకవర్గానికి చెందిన కేజే కుమార్ అనే నేత షష్టిపూర్తి కార్యక్రమం చేసుకుంటున్నారు.
ఆయన భార్య మాజీ మున్సిపల్ చైర్మన్. కానీ రోజాతో.. ఆయనకు విబేధాలున్నాయి. అందుకే.. ఆయన షష్టిపూర్తి కార్యక్రమానికి ఎవరూ వెళ్లవద్దని పార్టీ నేతలకు.. కార్యకర్తలకు హుకుం జారీ చేసింది. కాదు.. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు వెళ్తే.. వారి పార్టీద్రోహులుగా చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. రోజా మాటలను.. అక్కడి నేతలు పెద్దగా లెక్క చేయలేదు. పెద్ద ఎత్తున సాక్షి పత్రికలో కేజే కుమార్‌కు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనల్లో ఎక్కడా రోజా ఫోటో లేకపోవడంతో ఆమెకు మరింత ఆగ్రహం తెప్పించింది. అంతే కాదు.. నగరిలో… ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా రోజా ఫోటో లేదు. దాంతో ఆ ఆమె కోపం అరికాలికి చేరింది. వరుసగా పార్టీ నేతలకు ఫోన్లు చేసి…తిట్టడం ప్రారంభించారు.
అందరూ.. ఆ ప్రకటనలు తాము ఇవ్వలేదని.. ఫ్లెక్సీలు పెట్టలేదని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఆడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. రోజాపై… పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయని.. వారే ఇలా రోజా నిర్వాకాన్ని బయట పెట్టారని అంటున్నారు. అందుబాటులో ఉండకపోవడం.. నోటి దురుసు కారణంగా… ఆమెకు.. ప్రతీ గ్రామంలోనూ.. ప్రత్యర్థి వర్గం తయారైంది. కొన్ని రోజుల కిందట.. ఓ గ్రామంలో… సొంత పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో… వారిపై కేసులు పెట్టిన విషయం.. రచ్చ రచ్చగా మారింది.