నర్తనశాల నుంచి తేరుకోవడానికి, ఆ లగేజీని భుజాలపై నుంచి దింపుకోవడానికి నాగశౌర్య చాలానే కష్టపడ్డాడు. నర్తనశాలని ప్రేక్షకులంతా మర్చిపోవాలన్న కృతనిశ్చయంతో ఈసారి ఇంకాస్త సమయం తీసుకుని, ఇంకాస్త మనసు పెట్టి తీసిన సినిమా ‘అశ్వద్ధామ’. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఓ యువకుడి పోరాటం ఈ కథ. రాక్షసుడులా ఓ థ్రిల్లర్గా మలిచి, హిట్టు కొట్టాలని శౌర్య విశ్వ ప్రయత్నమే చేశాడు. తన ప్రయత్నం బాగున్నా – చిన్న చిన్న లోపాల వల్ల అనుకున్న స్థాయిని అందుకోలేకపోయింది. ఈ సినిమాపై దాదాపుగా 10 కోట్లు ఖర్చు పెట్టారు. బాక్సాఫీసు రిజల్టు చూస్తే ఆ డబ్బులు వెనక్కి రావడం కష్టంగానే అనిపిస్తోంది. అయితే శాటిలైట్, డిజిటల్ రూపంలో మంచి డబ్బులే వచ్చాయి నిర్మాతకు. జెమినీ టీవీ 2.5 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ సొంతం చేసుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 1.75 కోట్లు వచ్చాయి. అలా దాదాపు సగం డబ్బులు విడుదలకు ముందే రాబట్టుకోగలిగారు. `నర్తన శాల` తరవాత శౌర్య సినిమా ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ దక్కించుకోవడం విశేషమే. ఫైట్లు భారీగా ఉన్నాయి కాబ్టటి హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా బాగానే ముట్టాయి.