ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి పిల్లర్‌గా ఉంటుందనుకున్న కియా కార్ల పరిశ్రమ … తమిళనాడు వైపు చూస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయ్‌టర్స్ ఈ విషయాన్ని ప్రకటించడం సంచలనాత్మకంగా మారింది. కియా ప్రతినిధులు… తమిళనాడు సర్కార్‌ను సంప్రదించారని… వారితో వచ్చే వారం.. కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరుగుతాయని.. తమిళనాడు ప్రభుత్వంలోని కీలక అధికారి ఒకరు చెప్పినట్లు రాయ్‌టర్స్ మీడియా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కియా ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించి … గట్టిగా ఆరు నెలలు కాక ముందే.. కియా ప్లాంట్ తరలింపు ఆలోచకు రావడం.. కలకలం రేపుతోంది.
ప్రభుత్వ విధానాలతో కియా యాజమాన్యం అసంతృప్తి..!
కియా యాజమాన్యం ప్రధాన అభ్యంతరం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన స్థానికులకే 75 శాతం ఉద్యోగాలనే చట్టమేనని కియా వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కార్ల పరిశ్రమ ” స్కిల్డ్ లేబర్ ” మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వారిని దేశ విదేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన విభాగాల్లో.. స్థానికంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తోంది. కానీ… ఇప్పుడు.. ప్రతి విభాగంలోనూ 75 శాతం ఉద్యోగాలనే నిబంధన తేవడం… తమ ఉత్పత్తి సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుందని ఆ కంపెనీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కియాకు రెడ్ కార్పెట్ పరుస్తున్న తమిళనాడు ..!
తమిళనాడు ఆటోమోబైల్ పరిశ్రమకు ప్రసిద్ధి. అక్కడ బడా కంపెనీలన్నింటికీ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడి రాజకీయ పార్టీల మధ్య… రాజకీయ శత్రుత్వం తీవ్రంగా ఉన్నా… రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి పోనివ్వరు. వివాదాలు సృష్టించరు. అలాంటి వాతావరణం ఉంది కాబట్టే… తమిళనాడు పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో ఉంది. ఇప్పుడు.. కియా కూడా… తమిళనాడుకు వెళ్తే… ఆ రాష్ట్రానికి తిరుగు ఉండదు.
పారిశ్రామిక రంగంలో ఏపీ ఇక కోలుకోవడం కష్టమే..!
కియా కార్ల పరిశ్రమను.. ఆంధ్రప్రదేశ్‌కు తీసుకు రావడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా శ్రమించారు. మొదటగా.. కియాను.. కేంద్ర ప్రభుత్వం మాహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు సిఫార్సు చేసింది. అయితే.. చంద్రబాబు సంప్రదింపులు జరిపి.. వారిని అనంతపురంకు వచ్చేలా చేయగలిగారు. కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. రికార్డు స్థాయిలో ప్లాంట్ రెడీ అయింది. ఉత్పత్తి ప్రారంభమయింది. మరో పదిహేడు అనుబంధ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. పారిశ్రామిక పరంగా… కియా అనంతపురం జిల్లా రూపురేఖల్ని మార్చేస్తున్న సమయంలో… ప్రభుత్వం మారింది. అప్పట్నుంచి కియాపై వేధింపులు పెరిగాయన్న ప్రచారం ఉంది. వైఎస్ చెబితేనే వచ్చామన్న లేఖను ఇవ్వడం దగ్గర్నుచి మొదటి కారు రిలీజ్ రోజు.. ఎంపీ గోరంట్ల మాధవ్… తనను గౌరవించలేదని బెదిరింపులకు దిగడం.. హైలెట్ అయింది.