ఏంటీ విశేషం..? కియా … తమిళనాడు వెళ్లిపోతోందట..! … ఇదీ ఇరవై నాలుగు గంటలకుగా ఏపీలో జరుగుతున్న చర్చ. దీనంతటికి పులిస్టాప్ పెట్టేది ఒకే ఒక్కరు.. అదే కియా యాజమాన్యం. ఓ మార్కెటింగ్ హెడ్…. స్పందించారని కియా ప్లాంట్ ను తరలించడం లేదని.. మీడియా.. ఏపీ సర్కార్ క్లెయిమ్ చేసుకున్నాయి. కానీ.. కమ్మేసుకున్న అనుమాన మేఘాలు తొలగిపోవాలంటే… ఆ మార్కెటింగ్ హెడ్ ప్రకటన ఒక్కటి సరిపోదు. విధానపరమైన నిర్ణయాల విషయంలో మార్కెటింగ్ హెడ్‌కు సంబంధం ఉండదు. కియా యాజమాన్యమే ఈ ప్రకటన చేయాలి. కనీసం.. ఇండియా హెడ్ అయినా… ఓ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేదు.
రాయిటర్స్‌లో వార్త రావడం అంటే.. సామాన్యమైన విషయం కాదు. అది అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ. ప్రపంచంలోని అన్ని ప్రధాన పత్రికలకూ సేవలు అందిస్తుంది. విశ్వసనీయత అనే పునాదుల మీద ఆ న్యూస్ ఏజెన్సీ ఉంది. పెద్దగా సమాచారం లేకుండా రాయదు. అలా రాసిందంటే… దానికి ఫిక్స్ అయిపోతుంది. నిప్పు లేకుండా పొగ రాదు కాబట్టి…కియా యాజమాన్యం కూడా.. ఆ కథనంపై.. మౌనం వహించింది. ఆ వార్త వైరల్ అయినప్పటి నుండి.. ఏపీ సర్కార్ తరపున.. కియా యాజమాన్యాన్ని.. ప్రభుత్వం పెద్దలు సంప్రదిస్తూనే ఉన్నారు. అలాంటి ఆలోచనే లేదని.. ఓ ప్రకటన విడుదల చేయమని.. కోరుతున్నారు. కానీ.. కియా యాజమాన్యం మాత్రం… స్పందించలేదు.
నిజంగా తమిళనాడుతో సంప్రదింపులు జరిపారో లేదో కానీ… కియాకు తమ ఎలక్ట్రిక్ కార్ల తయారీ విస్తరణ యూనిట్ ను మాత్రం.. అనంతపురంలోనే పెట్టాలని అనుకోవడం లేదు. దాని కోసం.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనల కోసం చూస్తోంది. తమిళనాడులో ఆటోమోబైల్ ఇండస్ట్రీ కేంద్రీకృతమయింది. అక్కడ తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. ఈ దిశగా… తమకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే.. ఏపీ నుంచి వచ్చేస్తామని .. ఫీలర్..రాయిటర్స్ ద్వారా.. కియా పంపినట్లుగా ఉంది. కియా వ్యూహాత్మకంగానే.. ఈ ప్రచారాన్ని ప్రారంభించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.