జగన్‌ను ఏమైనా అంటే చంపేస్తాం.. పాతేస్తాం.. పూడుస్తాం..! ఇవీ మంత్రి అనిల్… ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన హెచ్చరికలు. ఆయన స్వభావమే అలాంటిది కాబట్టి… అందులో వింతేముందని.. అనుకోవచ్చు కానీ.. ఈ హింసా వాది… అలాంటి మాటలు అన్న సందర్భమే విచిత్రం. ఆయన కర్నూలుజిల్లా నంద్యాలో .. అహింసా వాదంతో స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. ఒక చెంపపై కొడితే.. మరో చెంప చూపించాలన్న విధానాన్ని పాటించిన మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అదే ఆయన ఆశయాలకు తానిస్తున్న గొప్ప గౌరవం అన్నట్లుగా మాట్లాడారు. తీరా విగ్రహావిష్కరణ చేసిన తర్వాత..తాను గాంధీ మహాత్ముడి చెంత ఉన్నానని.. అలాంటి మాటలు మాట్లాడకూడదని నియమం పెట్టుకోలేదు. తాను జగన్ భక్తుడినని.. ఆయన్ను ఏమైనా అంటే ఊరుకోనన్నారు. జగన్ మూడో నేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతారంటూ హెచ్చరించారు. మంత్రి పదవి ఉంటుంది..ఊడుతుంది. దాని గురించి ఎప్పుడూ మేం భయపడం. కానీ జగన్‌ను ఏమైనా అంటే మాత్రం పాతేస్తామని హెచ్చరించారు.
రాజకీయ విమర్శలంటే.. వైసీపీ నేతలకు.. తిట్లు, బెదిరింపులే తప్ప.. విధానమైన అంశాలపై ఎప్పుడూ మాట్లాడరు. దానికి తగ్గట్లుగానే.. ఉన్నా… అసలు సమయం సందర్భం చూసుకోకుండా.. అనిల్ ఆవేశం ఎందుకో చాలా మందికి అర్థం కావడం లేదు. చంద్రబాబును ఎక్కడైనా తిట్టుకోవచ్చు… కానీ.. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించినందున.. కనీసం మహాత్ముడికైనా గౌరవం ఇవ్వాల్సింది కదా.. అనే చర్చ సామాన్యుల్లో నడుస్తోంది.