సింహా,. లెజెండ్ చిత్రాలతో బాలకృష్ణని అభిమానులకు నచ్చేలా తీర్చిదిద్దాడు బోయపాటి శ్రీను. ఈ రెండు సినిమాలతోనే బోయపాటి మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఇది వరకే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్‌కి రంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి చిత్రీకరణ మొదలెడతారు. వారనాసిలో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. బాలయ్య పాత్ర ఈ సినిమాలో రెండు కోణాల్లో సాగబోతోంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఆఘోరాగా కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. కథానాయికల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. చాలామంది పేర్లు వినిపిస్తున్నా, ఆ ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇటు బాలయ్య, అటు బోయపాటి ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరికీ ఓ హిట్టు తప్పనిసరి.