ఇదే నా చివరి ప్రేమకథా చిత్రమ్ అంటూ – షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన `వరల్డ్ ఫేమస్ లవర్` తన చివరి లవ్ స్టోరీ అని చెప్పడం చిత్రసీమని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయాన్ని రాశీఖన్నా సైతం తప్పుబట్టింది. విజయ్‌కి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, వాళ్లంతా విజయ్‌ని ప్రేమకథా చిత్రాల్లో చూడాలనుకుంటారని, తాను కూడా అలానే భావిస్తున్నానని, విజయ్ తన నిర్ణయం పట్ల పునరాలించుకుంటాడని నమ్మకం తనకు ఉందని చెప్పింది రాశీఖన్నా. ఈ సినిమాలో రాశీ ఓ కీలక పాత్ర పోషించింది. యామినిగా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంది.
“వరల్డ్ ఫేమస్ లవర్.. నా మనసుకి దగ్గరైన చిత్రం. ఈతరం అమ్మాయిల్లో యామిని లక్షణాలు తప్పకుండా ఉంటాయి. నేనూ ఓ రకంగా యామినినే. ఇది నా నిజ జీవిత పాత్ర అనుకోవొచ్చు. ఈ సినిమాలో ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అదేమిటన్నది తెరపై చూడాలి. ఆ అంశం తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని షాక్‌కి గురి చేస్తుంది” అని ఊరిస్తోంది రాశీ. ఈ సినిమా ఈనెల 14న విడుదల అవుతోంది.