కియా పరిశ్రమ అనంతపురం నుంచి వెళ్లిపోతుందని.. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలతో ఏపీ ప్రభుత్వం షాక్కు గురయింది. అలా జరిగితే… మొత్తానికే తమకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందన్న అంచనాలతో ఉన్న ఏపీ సర్కార్… దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రాయిటర్స్ వార్తపై.. కియా అంత వేగంగా స్పందించలేదు. ప్రభుత్వం ఒత్తిడి చేయగా.. చేయగా.. పీఆర్వోతో ఓ ప్రకటన చేయించింది. అది కూడా.. ప్రభుత్వం అడిగినట్లుగా ఉంది. దీంతో.. పరిశ్రమల మంత్రి.. మేకపాటి గౌతంరెడ్డి కొరియా టూర్ పెట్టుకున్నారు.
స్థానిక యాజమాన్యం నుంచి… కియా తరలింపు వ్యవహారంపై తమకు సమాచారం లేదని సమాధానం రావడంతో.. కొరియాలో ఉన్న యాజమాన్యానికి సర్దిచెప్పేందుకు గౌతంరెడ్డి కొరియా వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి ఎలక్ట్రిక్ కార్ల తయారీ విస్తరణ ప్రణాళికల నుంచి.. కియా ఏపీని తీసేసిందంటున్నారు. అదే సమయంలో.. అనుబంధ పరిశ్రమలు.. చెన్నైకి, పుణెకి తరలి పోయాయి. వాటికి గత ప్రభుత్వం ఇచ్చిన భూములను… వెనక్కి తీసుకున్న ప్రభుత్వం… బిల్డ్ ఏపీలో భాగంగా అమ్మేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీంతో… కియా చుట్టుపక్కల పారిశ్రామిక అభివృద్ధికి బ్రేక్ పడినట్లు అవుతుంది.
గతంలో… కియా అనుబంధ పరిశ్రమలు.. కనీసం 30 నుంచి 40 వరకు పరిశ్రమలు పెట్టాలనుకున్నాయి. వాటిలో కొన్నింటినైనా… ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరింపచేయాలని… అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమపై కూడా నమ్మకంతో ఉన్నారని నిరూపించాలని ప్రభుత్వం తాపత్రయ పడుతున్నట్లుగా భావిస్తున్నారు.