రాజధావి విషయంలో ఎవరి పద్దతిలో వారు సెంటిమెంట్ రగిల్చడానికి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తరచూ రాజీనామా సవాళ్లు ఇందులో భాగం. రాజధాని మారుస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి.. ఇప్పుడు మళ్లీ రాజధాని ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని… టీడీపీ అధినేత చంద్రబాబు కొద్ది రోజలుగా.. జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా.. వైసీపీ నేతలు.. టీడీపీకి ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని.. ఎన్నికల్లో గెలిస్తే.., రెఫరెండంగా భావిస్తామని చెప్పుకొస్తున్నారు. ఇది అధ్యక్షు స్థాయిలో వెర్షన్… కింది స్థాయి నేతలు కూడా.. సవాళ్లు విసురుకుంటున్నారు.
వైసీపీలో అవంతి శ్రీనివాసరావు.. తనకంటే.. ఉత్తరాంధ్ర ఉద్యమకారుడు ఎవరూ లేనట్లుగా మాట్లాడుతూంటారు. విశాఖ టౌన్లో నలుగురు.. టీడీపీ ఎమ్మెల్యేలు గెలవడంతో వారిని టార్గెట్ చేస్తూంటారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా అంగీకరించకపోతే.. రాజీనామా చేసి.. మళ్లీ గెలవాలంటూ మాట్లాడుతూ ఉంటారు. దీనికి టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలే కాదు.. గుంటూరు ఎంపీ కూడా రాజీనామా చేస్తారు… వైసీపీ కి చెందిన రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేల్చుకుందామని సవాల్ చేశారు. ఈ రాజీనామాల ఆరోపణలు.. పరస్పరం… హైలెట్ అవుతున్నాయి.
రాజకీయాల్లో రాజీనామాల సవాళ్లు కామనే. రెండు వైపుల నుంచి ఇలాంటి సవాళ్లు వస్తూనే ఉంటాయి. కానీ ఎవరూ చేయరు. చేయడానికి సిద్ధపడరు. ఎవరైనా చేస్తే.. అధికార పార్టీ వాళ్లు చేస్తారు. వాళ్లు కూడా.. రాజీనామాలు ఆమోదించకూడదనో.. మరో షరతుతోనే.. తమ పార్టీతో ముందస్తు ఒప్పందం చేసుకుంటారు. వీరి సీరియస్ ప్రకటనలు చూసి.. నిజమని నమ్మే ప్రజల్ని బకరాల్ని చేస్తూంటారు.