తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించి.. సాధించిన కేసీఆర్… ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చేయడానికి సాగునీటి కోసం యజ్ఞమే చేపట్టారు. ఐదేళ్లలో ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి కళ్ల ఎదుట కనిపించే ఒకే ఒక్క సాక్ష్యం.. కాళేశ్వరం కాదు.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కాదు. అన్నింటికీ మించీ… రెట్టింపు అయిన ధాన్యం దిగుబడి. తెలంగాణ ఏర్పడినప్పుడు… ఎంత ధాన్యం దిగుబడి ఉండేదో.. ఐదేళ్లలో ఆ ధాన్యం దిగుబడి.. ఖచ్చితంగా రెండింతలు అంయింది. ఇది మామూలు విషయం కాదు. అసామాన్యమైన విషయం.
వరి పంట పూర్తిగా నీటి ఆధారిత పంట. తెలంగాణలో అత్యధికంవ్యవసాయ భూములన్నీ.. చెరువులు, బోర్ల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే.. ఎక్కువ మంది వరి సాగు మీద ఆశలు పెట్టుకోరు. బాగా వర్షాలు పడినప్పుడు మాత్రమే… వరి ఆలోచన చేస్తూంటారు. నీటి ఇబ్బందులు వస్తాయనే గత ప్రభుత్వాలు.. వరి పంట వేయవద్దని.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచనలు ఇచ్చేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను బాగు చేయడం… వివిధ ప్రాజెక్టుల నుంచి నీళ్లు అందుబాటులోకి రావడంతో.. రైతులు.. పెద్ద ఎత్తున వరి సాగు వైపు మళ్లారు.
2014-15లో కేవలం వరి సాగు 34.96 లక్షల ఎకరాల్లో మాత్రమే ఉండేది. 2019-20వో ఇది 68.50 లక్షల ఎకరాలకు చేరింది. అంటే రెట్టింపు అయింది. జలవనరులు అందుబాటులోకి రావడంతో.. ఇతర పంటల నుంచి రైతులు.. వరి వైపు వస్తున్నారు. దీనికి తగ్గట్లుగా ధాన్యం దిగుబడి కూడా.. రెట్టింపు అయింది. వరిధాన్యం దిగుబడి 2016-17లో కోటి టన్నులు రాగా ఈ ఏడాది కోటిన్నర టన్నులకు చేరింది. ఖరీఫ్, రబీ సీజన్లు అనే తేడా లేకుండా.. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా.. పచ్చని వరి పంట కనువిందు చేస్తోంది. వరి సాగు పెరగడంతో.. ఇతర వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది.