టీ ట్వంటీల్లో కివీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. వన్డేలో.. ఆ చాన్స్ కివీస్‌కు ఇచ్చింది. వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో ఓడిపోయింది. కివీస్ చేతిలో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ కావడం… గత 39 ఏళ్లలో ఇదే మొదటి సారి. 1981లో టీమిండియాను న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. మౌంట్ మాంగనూలో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచినప్పటికీ.. న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా.. యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు 296 పరుగులు చేసింది.
తర్వాత 47.1 ఓవర్లలోనే కివీస్.. లక్ష్యాన్ని ఐదు వికెట్లను కోల్పోయి సాధించింది. భారత బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్ సెంచరీ చేసి.. ఇన్నింగ్స్ కు పిల్లర్ నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఎవరూ సెంచరీ చేయకపోయినప్పటికీ… అందరూ నిలకడగా ఆడారు. ప్రతి ఒక్కరూ రెండంకెల స్కోరు సాధించారు. దీంతో.. న్యూజిలాండ్ ఏ దశలోనూ… కంగారు పడలేదు. ఆడుతూ పాడుతూ .. విజయాన్ని అందుకుంది. గ్రాండ్‌హోమ్ 58 , లాథమ్ 32 , గుప్తిల్ 66, నికోల్స్ 80 పరుగులు చేశారు.
వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ వైఫల్యం టీమిండియాను గట్టి దెబ్బ తీసింది. వరుసగా మూడు వన్డే సిరీస్‌ల్లో సెంచరీ చేయలేకపోయాడు కోహ్లీ. ఏడేళ్ల తర్వాత ఇలాంటి వైఫల్యం ఇదే తొలిసారి. ఐదు వన్డేల టీ ట్వంటీ సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేయగా.. మూడు వన్డేల సిరీస్ ను కివీస్ వైట్ వాష్ చేసింది. ఇక రెండు టెస్టుల సిరీస్ మిగిలింది.