అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో హాజరయ్యే విషయంలో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ … ఏప్రిల్ 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జగన్ వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్లో సీబీఐ…జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కౌంటర్లో కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు ప్రస్తావించడమే కాదు.. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నట్లు సమాచారం. సీబీఐ కౌంటర్పై వాదనలను ఏప్రిల్ 9వ తేదీన వింటామని… హైకోర్టు చెప్పింది.
ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితిలో ప్రజాసేవకు ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతో.. జగన్… మినహాయింపు కోసం పిటిషన్ వేశారు. అయితే….సీబీఐ కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఈడీ కేసుల్లోనూ.. న్యాయస్థానం.. తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఒక వేళ సీబీఐ కేసుల్లో.. మినహాయింపు దక్కినా.. ఈడీ కేసుల్లో కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈడీ కోర్టు తీర్పుపైనా జగన్.. హైకోర్టులో పిటిషన్ వేసుకున్నా.. అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు. మళ్లీ వేయలేదు. హైకోర్టులో ఏదీ తేలకపోవడంతో.. జగన్మోహన్ రెడ్డి ఇక తప్పనిసరిగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.
గత వారం ఆయన కోర్టుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు కానీ.. న్యాయమూర్తి సెలవు పెట్టడంతో.. చివరి క్షణంలో ఆగిపోయారు. హైకోర్టులో కూడా సీబీఐ… జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపును వ్యతిరేకిస్తూ.. కౌంటర్ దాఖలు చేయడంతో అక్కడ సానుకూల ఫలితం వచ్చే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.