ఆధ్రప్రదేశ్లో ఐటీ దాడుల అంశంలో కొత్తగా.. ఓ వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఆ వ్యక్తి పేరు కిలారు రాజేష్. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న ఆయన పై కూడా ఐటీ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం.. నిన్నామొన్నటి వరకూ బయటకు రాలేదు. అయితే హఠాత్తుగా ఈ విషయం బయటకు వచ్చింది. కిలారు రాజేష్ అనే వ్యక్తి టీడీపీలో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నప్పటికీ.. ఆయన పూర్తిగా లోకేష్ అంతరంగీకుడు. అందుకే.. కిలారు రాజష్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల వ్యవహారం ఇప్పుడు.. కొత్త కలకలం రేపుతోంది. కానీ.. కిలారు రాజేష్ ఇంట్లో ఐటీ సోదాల్లో ఏమీ దొరకలేదని.. కనీసం రూ. లక్ష కూడా దొరకలేదని… తెలుస్తోంది. అందుకే.. ఐటీ విభాగం కూడా.. ప్రెస్‌నోట్‌లో ఏ విషయాన్ని చెప్పలేదు.
అసలు.. మూడు పేరెన్నికగన్న ఐటీ సంస్థలు… చంద్రబాబు మాజీ పీఏ, లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఇళ్లపై ఐటీ సోదాలకు కారణం.. కొంత మంది పంపిన ఫిర్యాదులన్న చర్చ నడుస్తోంది. చంద్రబాబు అవినీతి చేశారని నమ్ముతున్న వైసీపీ నేతలు.. ఆ సొమ్మును ఎలా తరలించారో తెలుసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. అలాగే లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కాబట్టి.. కిలారు రాజేష్ పైనా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఫిర్యాదులపై రొటీన్ ప్రాక్టీస్‌లో భాగంగా.. ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఏమి బయట పడ్డాయో చెప్పారు. బయటపడని చోట ఏమీ చెప్పలేదు. అయితే.. వైసీపీ నేతలకు.. ఆ ఐటీ నోట్‌నే.. పెద్ద అస్త్రంగా మల్చుకున్నారు. కిలారు రాజష్ ఇంట్లో ఏమీ దొరకకపోయినా… ఆరోపణలు ప్రారంభించారు.
లోకేష్ స్నేహితుడు కిలారి రాజేష్ హస్తం కూడా ఉందని బుగ్గన కొత్తగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. రాజకీయాలంటే తెలియని కిలారి రాజేష్‌ని తీసుకొచ్చి..టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి ఇచ్చారని బుగ్గన లాజిక్ తీశారు. మొత్తానికి వైసీపీ నేతలు మోకాలికి..బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నా అది బురదపూడయడానికే త్ప.. మరిక దేనికి ఉపయోగపడటం లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.