ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో `జై లవకుశ` తీశాడు కల్యాణ్ రామ్. తమ్ముడు ఎన్టీఆర్‌తో ఓసినిమా చేయాలన్న కల దాంతో నెరవేరింది. ఆర్థికంగా కల్యాణ్ రామ్‌కి మంచి లాభాలూ వచ్చాయి. ఇప్పుడు తమ్ముడితో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో మరోసారి నటించడానికి ఎన్టీఆర్ కూడా సంసిద్ధత వ్యక్తం చేయడంతో ప్రస్తుతం కల్యాణ్ రామ్ కథల వేటలో ఉన్నాడు. `ఆర్.ఆర్.ఆర్` సినిమాతో బిజీగా ఉన్నాడు తారక్. త్వరలోనే త్రివిక్రమ్ కాంబో మొదలవుతుంది. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా కూడా లిస్టులో ఉంది. ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి చాలా సమయం పడుతుంది. అయితే ఈలోగా ఎక్కడైనా గ్యాప్ దొరికితే తన సినిమాని పట్టాలెక్కించడానికి కల్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్‌కి తగిన కథ చెప్పమని, తనకు బాగా పరిచయం ఉన్న ఓ దర్శకుడిని అడిగినట్టు తెలుస్తోంది. ఆయన కూడా తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి పారితోషికం బదులుగా, లాభాల్లో వాటా ఇవ్వాలని కల్యాణ్ రామ్ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చిన లాభాల్లో చెరిసగం పంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఓ మంచి కాన్సెప్ట్ కథ దొరికితే, పరిమిత వనరులతో సినిమా తీసి, మంచి లాభాలు తెచ్చుకోవాలని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడు. ఒకరిద్దరు కొత్త దర్శకులు కూడా కళ్యాణ్ రామ్ కి కథలు వినిపించినట్టు సమాచారం.