చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులకు రూ.రెండు వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా.. ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్‌ను.. టీడీపీ నేతలు బయట పెట్టారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత ప్రతీ చోటా..తాము గుర్తించినవి.. స్వాధీనం చేసుకున్న వాటిని వివరిస్తూ.. మొత్తంగా.. ఓ పంచనామా రిపోర్ట్‌ను.. ఎవరిపై సోదాలు చేశారో వారికి ఐటీ అధికారులు ఇస్తారు. అలా శ్రీనివాస్‌కు కూడా.. పంచనామా రిపోర్ట్‌ను ఐటీ అధికారులు ఇచ్చారు. అందులో.. నగదు 2.63వేల రూపాయలు గుర్తించినట్లుగా.. అలాగే 12 తులాల బంగారం గుర్తించినట్లుగా చెప్పారు. అంతకు మించి ఒక్క పైసా కూడా.. ఉన్నట్లుగా చెప్పలేదు. అలాగే.. వందల, వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు దొరికినట్లుగా … ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా లేదు. అంతిమంగా.. రూ. 2.63ర లక్షలు.. 12 తులాల బంగారం మాత్రమే… శ్రీనివాస్ ఇంట్లో బయటపడింది.
దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ దాడులను.. ఒక్క శ్రీనివాస్‌కు.. ఆయన పని చేసిన చంద్రబాబుకు ముడిపెట్టి.. వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ విభాగం.. తన ప్రెస్‌నోట్‌లో .. రూ. రెండు వేల కోట్ల పన్ను కట్టని లావాదేవీలు జరిగాయని చెప్పింది. మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు మొత్తానివి కలిపి ఆ మొత్తం అందులో శ్రీనివాస్ పాత్ర లేదు. కానీ శ్రీనివాస్ మీద.. కిలారు రాజేష్ అనే వ్యక్తి మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఐటీ అధికారులు.. అందరితో పాటు.. మూకుమ్మడి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అన్నింటికీ కలిపి ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇదే.. వైసీపీ నేతలు ఆరోపణల పండగ చేసుకోవడానికి కారణం అయిందని టీడీపీ నేతలు అంటున్నారు.
ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామాలో.. విలువైన ఆస్తులు.. వజ్రాలు.. వైఢూర్యాలు.. షాపింగ్ కాంప్లెక్స్‌లు లాంటివి బయటపడినా.. కచ్చితంగా పంచనామాలో నమోదు చేసేవారు. అవేమీ దొరకలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం బురద చల్లడానికి దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ సోదాల్ని.. చంద్రబాబుకు అంట గడుతున్నారని మండి పడుతున్నారు.