పవన్ కల్యాణ్ భక్తుడిగా పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్‌తో పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఆ స్థాయి హిట్ ఆ తరవాత హరీష్‌కి దక్కలేదు. ఇప్పుడు పవన్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. త్వరలోనే ఈ గబ్బర్ కాంబో పట్టాలెక్కనుంది. అయితే ఆ వెంటనే చిరంజీవితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు హరీష్. చిరు కోసం ఇది వరకెప్పుడో ఓ కథ తయారు చేశాడు హరీష్. చిరు ఓకే అంటే వినిపించడానికి రెడీ అని చాలాసార్లు చెప్పాడు. అయితే ఈమధ్య చిరంజీవిని కలిసినప్పుడు హరీష్ దగ్గరున్న కథ గురించి చర్చ నడిచిందని సమాచారం. చిరు కూడా హరీష్‌తో పనిచేయడానికి చూచాయిగా అంగీకరించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని హరీష్ కూడా ఒప్పుకుంటున్నాడు. త్వరలో చిరంజీవితో పనిచేసే అవకాశాలున్నాయని హింట్ ఇస్తున్నాడు. పవన్ తో సినిమా హిట్టయితే తప్పకుండా చిరుతో పనిచేసే అవకాశం తలుపు తట్టినట్టే. ఇప్పటికే పవన్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్‌లతో పని చేసేశాడు హరీష్. చిరుతో కూడా సినిమా చేసేస్తే మెగా ఫ్యామిలి (చరణ్ తప్ప) అందరితోనూ ఓ రౌండ్ పూర్తయినట్టు ఉంటుంది.