తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్యకు.. ఇంత కాలం రాని డౌట్ వచ్చింది. అదేమిటంటే.. తాను చాలా కాలం నుంచి టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానని… అన్ని మీడియాలు తన ప్రెస్మీట్లు కవర్ చేస్తూంటాయని..కానీ ఒక్కటంటే.. ఒక్క సారి కూడా.. తన మాటలు కానీ.. తన స్టేట్మెంట్లు కానీ..సాక్షి మీడియాలో రాలేదనేది ఆయనకు వచ్చిన డౌట్. ఈ విషయమే అడుగుతూ… వైఎస్ భారతికి బహిరంగలేఖ రాశారు. టీడీపీ అధికార ప్రతినిధిగా.. తన ప్రకటనలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం తాను.. దళితుడ్ని అయనందువల్లేనే చూపించడం లేదా అని ప్రశఅనించారు. మీడియాలో.. ఇలా సామాజికవర్గాల వారీగా చూసి.. ప్రాధాన్యలు ఇవ్వడం.. అసలు పట్టించుకోకపోవడం వంటి వాటిని తాను చూడలేదన్నారు.
పనిలో పనిగా.. ఐటీ దాడులు విషయంలో సాక్షిపత్రిక కథనాలను తప్పు పట్టారు. సాక్షి మీడియా.. టీడీపీకి చెందిన వార్తలను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. వారి వాయిస్ ను కూడా వినిపిస్తున్నామని చెప్పుకునేందుకు ఎక్కడో చోట.. రెండు, మూడు కాలమ్స్ వార్త ప్రచురిస్తుంది. అనేక మంది టీడీపీ నేతల స్టేట్మెంట్లు, ప్రెస్మీట్లు.. ఎంతోకొంత కవర్ చేసింది సాక్షి. అయితే.. వర్ల రామయ్యకు మాత్రం చాన్సివ్వడం లేదు. వర్ల రామయ్య… ప్రధానంగా.. లీగల్ ఇష్యూస్ మీద.. జగన్ కేసుల మీద.. వివేకా హత్య కేసుల మీద ప్రెస్మీట్లు పెడుతూంటారు. రాజకీయ, పాలనాపరమైన వార్తలకు సాక్షి అంతో ఇంతో.. కవరేజీ ఇస్తుందేమో కానీ.. ఇలాంటి వాటికి అసలు ఇవ్వలేదు.
ఈ విషయాన్ని వర్ల రామయ్య గుర్తించలేదో.. లేక.. తనను.. గుర్తించడం లేదనే విషయాన్ని.. సామాజికవర్గ కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నారో కానీ.. లేఖ రాశారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. వర్ల రామయ్యకు సంబంధించిన వ్యతిరేక వార్తలు ఏమైనా వస్తే మాత్రం… సాక్షి చాలా సార్లు ప్రసారం చేసింది. కానీ ఆయన ప్రెస్మీట్లను మాత్రం కవర్ చేయడం లేదు. అదే… వర్ల రామయ్య అసహనానికి కారణం కావొచ్చు.