తాను మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని వారు ఉంటారని.. చంద్రబాబు లాంటి వారికి చాలా కడుపుమంట ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్ వేశారు. కర్నూలలో కంటి వెలుగు కార్యక్రమం మూడో దశ ప్రారంభించిన ఆయన… చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కేన్సర్‌కు చికిత్స ఉంది కానీ… అసూయతో వచ్చే కడుపుమంటకు చికిత్స లేదన్నారు. చెడు దృష్టికి ఎక్కడా చికిత్స లేదని.. నిజాయితీతో పనిచేస్తున్నాం, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నామన్నారు. వైద్యం, ఆరోగ్యంపై దృష్టిపెట్టి.. ప్రజల ఆరోగ్యం, ఆనందం, భవిష్యత్ కోసం గట్టిగా నిలబడతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందు కోసం మూడేళ్లలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి జరుగుతుందని.. ప్రకటించారు.
రూ.15,337 కోట్లతో వైద్యరంగాన్ని బలోపేతం చేసి.. అవసరమైన చోట కొత్త ఆస్పత్రులను నిర్మిస్తామని ప్రకటించారు. ఏరియా ఆస్పత్రులకు రూ.700 కోట్లు కేటాయించడమే కాక… కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ.. ఏర్పాటు చేస్తామని… 25 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అవ్వ, తాతలకు గ్రామ సచివాలయాల్లో కంటి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి ఆపరేషన్లు, కళ్లజోడులు ఉచితంగా ఇస్తామన్నారు.
కంటి వెలుగు కార్యక్రమం.. మొదటి రెండు దశలను ప్రభుత్వం పూర్తి చేసింది. మొదటి రెండు దశల్లో.. స్కూలు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. వృద్ధులకు కళ్లజోళ్లు పంపిణీ చేసింది. నాడు – నేడు పేరుతో… జగన్మోహన్ రెడ్డి.. ఆస్పత్రుల రూపురేఖలను మార్చాలన్న పట్టుదలతో ఉంది. ఇందు కోసం భారీ లక్ష్యాలను పెట్టుకుంది.