జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ ఢిల్లీలో పర్యటించనున్నారు. గతంలో తాను ప్రకటించిన రీతిలో అమర సైనికుల సంక్షేమం కోసం కేంద్ర సైనిక బోర్డు కి కోటి రూపాయల విరాళాన్ని అందించనున్నారు. ఆ తర్వాత స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమర సైనికుల సంక్షేమం కోసం కోటి రూపాయల విరాళం అందించనున్నట్లుగా దాదాపు నెల రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా షూటింగ్ సమయంలోనే, అప్పట్లో కార్గిల్ సైనికుల కోసం కూడా విరాళం ఇచ్చిన సంగతి ని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా హుదూద్ తుఫాను సమయంలో, కొంతమంది చిన్న నటులు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారి ఖర్చుల కోసం, ఇలా అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ తన దాతృత్వ వైఖరిని చాటుకున్నాడు అని, తన ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి మరీ సహాయం చేశారని వారు గుర్తు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో జనసేన బిజెపికి మధ్య బంధం బలపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఏమి మాట్లాడనున్నారు అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.