తెలుగు చలన చిత్రసీమ సెన్సార్ బోర్డు అధికారి మారారు. తమిళనాడుకు చెందిన ఈలా మీనా కొత్త అధికారిణిగా నియమితులయ్యారు. ఇది వరకు రాజశేఖర్ ఈ పదవిలో ఉండేవారు. ఆయన పదవీ కాలం ముగియడంతో.. కొత్త అధికారిణి చేరారు. సెన్సార్ బోర్డులో కీలకమైన మార్పు జరగడంతో నిర్మాతలు ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే మాజీ అధికారితో తెలుగు చిత్ర నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు. లేని పోని రూల్స్ పేరుతో… సినిమాల్ని సెన్సార్ చేయకుండా ఆపేసేవారని, దాంతో చాలా సినిమాలు విడుదలకు ముందు టెన్షన్ పడ్డాయని, అందుకే రాజశేఖర్‌పై నిర్మాతలంతా గుర్రుగా ఉండేవారని తెలుస్తోంది. కొత్త అధికారిణి అధికారికంగా ఛార్జ్ కూడా తీసుకున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే వలయం అనే చిత్రానికి సెన్సార్ జరిగింది. మరి ఈ ఆఫీసరు ఎలా ఉంటారో..?