కోటి మందితో స్వాగతం అందుతుంది.. అది కనీ వినీ ఎరుగని స్వాగతం అవుతుందని… ఇండియాలో తన పర్యటనపై … అమెరికా అధ్యక్షుడు ట్రంప్ … అధిక అంచనాలు పెట్టుకున్నారు. 130 కోట్ల మంది ఉన్న భారత్‌లో తన కోసం.. కోటి మంది ర్యాలీలో పాల్గొనరా…. అన్నది ఆయన ధీమా. ఈ కోటి అనే… సంఖ్య ట్రంప్‌కు బాగా నచ్చింది. అలా నచ్చడానికి కారణం… భారత ప్రధాని మోదీనే. ఆయన ఇండియా పర్యటనకు వస్తే… కోటి మందితో స్వాగతం చెబుతామని.. మోడీ గతంలో ట్రంప్‌కు చెప్పారట. ఈ విషయాన్ని కూడా ట్రంపే చెబుతున్నారు.
మోడీ చెప్పారు కదా.. అని రోజూ… భారత్‌లో తన స్వాగత సత్కారాలపై రోజూ.. నివేదిక తెప్పింకుంటున్నట్లుగా ఉన్నారు. లక్ష ఇరవై వేల మంది పట్టే స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. భద్రతా కారణాలతో సగం మందిని మాత్రమే… అనుమతించబోతున్నారన్న సమాచారం అందిందేమో కానీ.. వెంటనే.. బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు.. కోటి మంది కన్నా తక్కువైతే తనకు నచ్చదని నేరుగా చెప్పేశారు. అహ్మదాబాద్‌లో మోడీ కార్యక్రమానికి .. కోటి మంది రావాలంటే.. గుజరాత్లో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు అహ్మదాబాద్‌కు రావాల్సి ఉంటుంది.
భారత్‌లో రాజకీయ పార్టీల ర్యాలీల్లో పాతిక వేల మంది పాల్గొంటేనే.. నాలుగైదు లక్షల సంఖ్య చెప్పుకుని పార్టీలు సంతోషపడుతూంటాయి. ఓ చిన్న గ్రౌండ్‌ను సభకు ఎంపిక చేసుకుని.. కిక్కిరిసిపోయేంత జనం వచ్చారని ప్రచారం చేసుకుంటాయి. అయితే.. అలాంటి ట్రిక్కులు.. ట్రంప్ దగ్గర పని చేయవు. ఆయన కోటి మంది అని లెక్కలు వేసుకుని వస్తున్నారు. అంత మంది… స్వాగతం పలకకపోతే.. ఆయన ఏం మాట్లాడతారో.. అంచనా వేయడం కష్టం.. మోడీనే తనకు కోటి మందితో స్వాగత హామీ ఇచ్చారు కాబట్టి… కార్యక్రమంలో ఏమైనా నెగటివ్ వ్యాఖ్యలు చేస్తే.. పరిస్థితి ఘోరంగా మారిపోతుందని.. బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ట్రంప్‌కు కల్పించిన అంచనాలను అందుకోవడానికి గుజరాత్ బీజేపీ.. సర్వ ప్రయత్నాలు చేస్తోంది.