అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయనకు గౌరవసూచకంగా.. ఇరవై ఐదో తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. దీనికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఈ జాబితాలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చోటు లభించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. కేసీఆర్ ఇరవై ఐదున ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే.. కేసీఆర్ కు ఆహ్వానం పంపిన రాష్ట్రపతి భవన్.. ఏపీ సీఎంను.. విస్మరించింది. ఈ విందు కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించలేదు. ఐదారు రాష్ట్రాల సీఎంలను మాత్రమే ఆహ్వానించారు.
అయితే.. ఈ ఆహ్వానికి ప్రాతిపదిక ఏమిటో మాత్రం క్లారిటీ లేదు. ఒడిషా సీఎంను… కూడా… బీజేపీయేతర రాష్ట్రాల పార్టీల నుంచి ఆహ్వానించారు. కేసీఆర్, నవీన్ పట్నాయక్ మాత్రమే.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఏపీ సహా.. పంజాబ్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపలేదు. వస్తోంది అమెరికా అధ్యక్షుడు కాబట్టి.. ఆయనతో విందు భేటీకి హాజరవడం.. అందరికీ.. ప్రెస్టిజియస్ గానే ఉంటుంది. అమెరికాతో భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్టుల ప్రకారం చూసినా.. ఏపీ సీఎంకు అవకాశం లభించి ఉండాల్సిందంటున్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విషయంలో సహకారం అందించేందుకు గతంలో నరేంద్రమోదీనే… అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు.
ఆ ప్రాజెక్ట్ పెద్దగా వర్కవుట్ అవుతున్న సూచనలు లేవు. ఏపీ సీఎంకు ఈ భేటీలో అవకాశం ఇచ్చి ఉంటే.. ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు అవకాశం లభించి ఉండేది. అయితే.. అది పూర్తిగా…. ట్రంప్ గౌరవార్థం .. రాష్ట్రపతి ఇస్తున్న విందు మాత్రమేనని… ఆహ్వానాల విషయంలో… రాజకీయాలకు అవకాశం ఉండదు.