తెలంగాణ పోలీసు శాఖలో అవినీతిపై… పోలీసు అధికారులు దొంగలతో చేస్తున్న దోస్తీలపై… బదిలీల్లో అవినీతిపై.. ఈనాడు దినపత్రిక కథనాలపై పోలీసు యంత్రాంగం మొత్తం ఉలిక్కిపడింది. పోలీసుల వ్యవహారం కాబట్టి… వారి మార్క్‌లోనే ఈనాడుకు హెచ్చరికలు ప్రారంభమయ్యాయి. వెయ్యి కోట్ల దావా వేస్తామని… నోటీసులు ఇస్తామని… మరొకటని పోలీసులు హెచ్చరించారు. ఇందులో… హోంమంత్రి.. కమిషనర్.. సహా… పలువురు కీలకమైన వ్యక్తులు ఉన్నారు. సాధారణంగా ఇలాంటి కథనాలు వస్తే.. వివరణ ఇచ్చి.. సరిపెడతారు. కానీ. .. ఈ కథనాలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. భుజాలు తడుముకున్నట్లుగా… “ఏయ్” అనే హెచ్చరికలు ప్రారంభించారు.
ఈనాడు సాదాసీదాగా కథనాలు రాయదు. పూర్తి పరిశోధన.. పక్కా సమాచారం నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురిస్తుంది. ఈ విషయంలో ఆ పత్రిక స్టాండర్డ్స్ అలాగే ఉంటాయి. అందుకే ప్రజల్లో విశ్వసనీయత ఉంటుంది. ఈ కథనాలతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ ప్రారంభమయింది. అందుకే హెచ్చరికలు ప్రారంభించారని అంటున్నారు. నిజానికి ఈ కథనానికి ఉన్నత స్థాయిలో ఆమోదం ఉందని అంటున్నారు. వివిధ శాఖలో అవినీతిపై… ప్రత్యేకంగా గురి పెట్టిన ప్రభుత్వ పెద్దలు.. రెవిన్యూ శాఖ తరవాత పోలీసు వ్యవస్థనూ సంస్కరించాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. దాని కోసం… ఇది ఓపెనింగ్ అని అంటున్నారు. ఈ విషయం పోలీసు అధికారులకూ ఓ అంచనా ఉందని.. అందుకే… అలాంటిదేమీ లేదని.. చెప్పడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు.
పోలీసుల వ్యవస్థలో లంచాలు వ్యవస్థీకృతమనేది చాలా కాలంగా ఉన్నమాట. కీలక ప్రాంతాలకు పోస్టింగుల కోసం… ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చుకునే కింది స్థాయి ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారు. ఇక రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి… పోస్టింగులు తెచ్చుకునేవారికి కొదవ లేదు. ఇవన్నీ.. ఏళ్ల తరబడి ఉన్న బహిరంగ రహస్యాలు. ఇప్పుడున్న పరిస్థితులకు ముడి పెట్టి… ఈనాడు చాలా తెలివిగా కథనాన్ని ప్రజలకు చేరువ చేసింది. మామూలుగా… అయితే.. అలాంటిదేమీ లేదని.. ఓ రిజాయిండర్ పంపి.. పోలీసులు ఊరుకోవచ్చు. దాంతో.. విషయం పెద్దదయ్యేది కాదు. కానీ.. ఇప్పుడు ఈనాడుపై దావా.. అని చర్యలు అని.. చెబుతూండటంతో.. విషయం పెద్దవుతోంది. ఈ వ్యవస్థలో ఉన్న అవినీతి బయటకు వచ్చే మార్గం బయటపడుతోంది. అందుకే దటీజ్ పవర్ ఆఫ్ ఈనాడు అని అనుకోవచ్చు..