కృష్ణా జిల్లా జగయ్యపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన సామినేని ఉదయభానుకు… మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు..? ఈ ప్రశ్న చాలా కాలం నుంచి… కృష్ణా జిల్లా నేతలకు ఓ మిస్టరీగా ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు మంత్రి పదవులు తెచ్చుకున్న కొడాలి నాని, పేర్ని నానిలతో పోలిస్తే… సామినేని ఉదయభానునే.. వైఎస్ కుటుంబం పట్ల అత్యధికంగా విధేయత ప్రదర్శిస్తూ ఉంటారు. వైఎస్ కు సామినేని కుటుంబం అత్యంత సన్నిహితులుగా పేరు ఉంది. మొదటి నుంచి జగన్‌తో నడిచారు ఉదయభాను. గతంలో మంత్రి పదవి హామీ కూడా … జగన్ వైపు నుంచి వచ్చిందని చెబుతూంటారు. కానీ… అనూహ్యంగా.. వైసీపీ భారీ విజయం సాధించిన తర్వాత.. మంత్రివర్గ జాబితాలో ఆయన పేరు జాబితాలో కనిపించలేదు. దీంతో.. కృష్ణా జిల్లా రాజకీయవర్గాలు షాక్ అయ్యాయి.
ఎన్నికలకు ముందు.. వైసీపీ.. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసింది. ఓ సందర్భంలో.. తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు.. పవన్ కల్యాణ్ కు నలుగురు పెళ్లారు.. వేరేవాళ్లయితే నిత్యపెళ్లికొడుకు అని పేరు చెప్పి బొక్కలో వేసి ఉండేవారని ఘాటు విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమైన కాపు నేతలందరికీ సందేశం పంపింది. అందరూ.. అలాంటి విమర్శలే చేయాలని.. ఇంకాస్త ఘాటుగా ఉండాలని ఆ సందేశం సారాంశం.
కానీ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసేందుకు సామినేని ఉదయభాను నిరాకరించారు. అయితే.. ఈ కాంటెస్ట్‌లో… ఇతర కాపు నేతలు చెలరేగిపోయారు. పేర్ని నాని అయితే.. ఒకటికి.. మూడు మార్కులు తెచ్చుకున్నారు. ఇవన్నీ వైసీపీ హైకమండ్ దృష్టిలో పడ్డాయి. చివరికి… మంత్రి పదవికి మెరిట్ ను బయటకు తీసే క్రమంలో… సామినేని ఉదయభానుకు.. ఈ విషయంలో రిమార్కులు పడ్డాయి. పేర్ని నానికి మార్కులు పడ్డాయి. దాంతో మంత్రి పదవి ఆయనకే వచ్చింది. విధేయత పక్కకుపోయింది. ఒక్క పేర్ని నానికే కాదు… పవన్ కల్యాణ్‌పై అత్యంత దారుణంగా వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడిన వారికి మాత్రమే… వైసీపీలో ప్రాధాన్యం లభిస్తోందనేది.. చాలా కాలంగా ఉన్న మాట దానికి తగ్గట్లుగానే… ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ లాంటి వాళ్లు… పవన్ ను.. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూంటారు.
సామినేని ఉదయభాను… తనకు మంత్రి రాకపోవడానికి కారణం ఏమిటో… తెలుసుకున్నారు. తాను తప్పు చేశానని ఆయన అనుకోవడం లేదు. కానీ.. ఆయన తన విలువల్ని జగన్ గుర్తిస్తారని ఆశ పడ్డారు. ఎన్నికలకు ..కౌంటింగ్ కు మధ్య నెలన్నర రోజుల సమయం ఉంది. ఆ సమయంలో మంత్రి సామినేని ఉదయభాను.. పేరుతో.. నియోజకవర్గంలో.. చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. గెలిస్తే… మంత్రి పదవి ఖాయమని.. జగన్ ఇచ్చిన భరోసాతోనే వాటిని ఏర్పాటు చేశారు. కానీ అప్పుడే… హైకమండ్ నుంచి.. సామినేనికి వార్నింగ్ వచ్చింది. వెంటనే.. ఆ ఫ్లెక్సీలు తీసేశారు. ఆ ఫ్లెక్సీలు ఇంకా ఉపయోగించడానికి అవకాశం రాలేదు.