అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందు భేటీకి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం రాలేదు. దీన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయ విమర్శలకు వాడుకుంటోంది. ఆయనపై కేసులున్నాయని… ఆయన అవినీతి పరుడని.. అగ్రరాజ్యానికి తెలుసని.. అలాంటి వ్యక్తిని రానివ్వరని.. విమర్శిస్తోంది. అంతే కాదు.. అది ఏపీకి జరిగిన అవమానమని కూడా తేల్చేస్తోంది. విమర్శించాలి కాబట్టి.. ప్రతీ దాన్ని… జగన్మోహన్ రెడ్డి కేసులకు.. సీబీఐ విచారణకు లింక్ పెట్టి.. టీడీపీ విమర్శించేస్తోందన్న అభిప్రాయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.
దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి.అందులో పిలించింది ఎనిమిది మంది ముఖ్యమంత్రుల్ని మాత్రమే. మిగతా 21 మంది ముఖ్యమంత్రుల్ని.. ఎందుకు పిలవలేదు..? ఈ లాజిక్‌ను తెలుగుదేశం పార్టీ మిస్సయింది. ఆర్థికనేరగాడనే.. జగన్మోహన్ రెడ్డిని.. ఆహ్వానించలేదని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబు లెక్క ప్రకారం.. మిగతా 20 మంది ముఖ్యమంత్రులకు కూడా అదే మైనస్ పాయింట్ అయి ఉండాలి. కానీ.. అలా.. ముఖ్యమంత్రులపై కేసులు లేవు. అయినా వారికి ఆహ్వానం లేదు. పలు కీలక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు.
విందుకు ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించడంలో.. అటు అమెరికా అధికారులు..ఇటు రాష్ట్రపతి భవన్ కొన్ని ప్రాతిపదికల్ని పెట్టుకుంది. అందులో సీబీఐ కేసులుఉన్న వాళ్లను పిలువకూడదనే నిబంధన లేదు. ముఖ్యమంత్రుల దగ్గరకు వచ్చే సరికి ఉండదు కూడా. ఆయనపై సీబీఐ కేసులు ఉన్నాయా లేదా అన్నది టాపిక్ కాదు.. ఉన్నా… లేకపోయినా… ఆయనకు ముఖ్యమంత్రి హోదా ఉంటుంది. అదే ఫస్ట్.. ఆ తర్వాతే మిగతావి. జగన్మోహన్ రెడ్డి కి ఆహ్వానం రాకపోవడానికి కేసులు కారణం కాదు. ఏపీకి అవమానం కూడా కాదు. కానీ జగన్ వల్ల ఏపీకి అన్యాయం జరిగిపోయిందని.. టీడీపీ మాత్రం ప్రచారం చేసేస్తోంది.