తేజ కొత్త సినిమా `అలమేలు మంగ – వేంకటరమణ` కి సంబంధించిన అధికారిక ప్రకటన ఈమధ్యే వచ్చింది. వేంకట రమణగా గోపీచంద్ ఫిక్సయ్యాడు. ఇప్పుడు అలమేలు మంగ కోసం అన్వేషణ మొదలైంది. ఈ పాత్ర కోసం ముందు కాజల్ ని అనుకున్నారు. మరి ఇంతలోనే ఏమయ్యిందో… కాజల్‌ని తేజ పక్కన పెట్టేశాడు. ఆ స్థానంలో మరో అగ్ర కథానాయిక కోసం వేట మొదలైంది. ఈ పాత్ర కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే కీర్తి సురేష్, లేదంటే అనుష్కతో అలమేలు పాత్ర చేయించాలని చూస్తున్నాడు తేజ. ప్రస్తుతానికైతే కీర్తి సురేష్‌తో సంప్రదింపులు మొదలయ్యాయి. తేజతో పనిచేయడానికి కీర్తి ఆసక్తి చూపిస్తోందని, అయితే కాల్షీట్ల వ్యవహారమే ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం `సిటీమార్`తో బిజీగా ఉన్నాడు దాని తరవాతే తేజ సినిమా మొదలౌతుంది.