స్వీక్వెల్లూ, ప్రీక్వెల్లూ తీసే అవకాశాలు థ్రిల్లర్ కథలకే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఖైదీకి సీక్వెలూ తీయొచ్చు, ప్రీక్వెలూ తీయొచ్చు. ఖైదీ 2లో ఆ రెండు లక్షణాలూ కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని కథలు ఫ్రాంజైజీలకు బాగుంటాయి. టైటిల్ వాడుకుని వేర్వేరు కథలతో, వేర్వేరు హీరోలతో సినిమాలు తీసుకోవొచ్చు. నాని కూడా అదే నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా హిట్టవుతుందని, దాంతో ఆ పేరు వాడుకుని సిరీస్ తీయొచ్చని భావించాడు.
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. శుక్రవారం విడుదలైంది. తొలిరోజే డివైడ్ టాక్ వచ్చింది. నిర్మాతగా నాని సేఫ్ జోన్లోకి వెళ్లిపోయినా, బాక్స్ ఆఫీస్ దగ్గర తనవైన మెరుపులు మెరిపించలేకపోయింది. `ఆ` లా… ఇది అందరినీ ఆశ్చర్యపరచలేకపోయింది. ఈమధ్య వస్తున్న అనేకమైన థ్రిల్లర్ చిత్రాలలో ఇదొకటి గా మిగిలింది తప్ప, నాని మాత్రమే ఇలాంటి సినిమాల్ని తీయగలడు… అనేటి ముద్ర వేయించుకోలేకపోయింది. ఈనేపథ్యంలో హిట్ 2, హిట్ 3 ఆశించడం కష్టమే. అన్నింటికంటే ముఖ్యం విశ్వక్ సేన్‌ని సీక్వెల్ కోసం ఒప్పించడం. విక్రమ్ పాత్రలో తాను భలేగా ఒదిగిపోయాడు. తాను గనుక లేకపోతే… ఈ సినిమా చూడడం మరింత కష్టమయ్యేది. విశ్వక్ చేసిన జోనరే మళ్లీ చేయడం లేదు. హిట్ సినిమా ఫ్రైంచైజీని తాను భుజాలపై మోస్తాడన్న నమ్మకం లేదు. విశ్వక్ లేకపోతే.. నాని కూడా హిట్ ఫ్రైంచైజీని ముందుకు లాగడం కష్టమే. కాబట్టి.. హిట్‌కి ఇది పుల్ స్టాప్ కావొచ్చు.