ప్రభుత్వం వివిధ దేశాలకు కేబినెట్ ర్యాంక్ హోదాలతో కూడిన ప్రత్యేక ప్రతినిధి పదవులను పంపిణీ చేసింది. గతంలో జారీ చేసిన జీవోలు.. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా గత ఏడాది నవంబర్ పదమూడో తేదీన.. జారీ చేసిన జీవో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ జీవో ప్రకారం.. .అంధ్రప్రదేశ్ ప్రభుత్వం గల్ఫ్ దేశాలన్నీ… కవర్ చేసేలా.. మిడిల్ ఈస్ట్‌కు ఓ ప్రత్యేక ప్రతినిధిని నియమించింది. ఆయనెవరో సామాన్యులెవరికీ తెలియదు. సామాన్యులకే కాదు.. ఏపీ ఉన్నతాధికారులకు కూడా తెలియదు. ఆయన పేరు జుల్ఫీ రవ్‌డిజీ. ఈయన ఏ రంగంలో ప్రముఖుడో .. ఆయనను నియమించడానికి గల కారణాలేమిటో.. చెప్పకుండానే ఆయనకు.. కేబినెట్ మంత్రి పదవితో సమానంగా హోదా కల్పిస్తూ..జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
జుల్ఫీ అనే ఈ కేబినెట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ర్యాంక్ ప్రత్యేక ప్రతినిధి.. హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసిగా పేర్కొన్నారు. ఈయన సేవలు స్వచ్చందం కాదు. ఈయనకే కేబినెట్ ర్యాంకుకు తగ్గట్లుగానే చెల్లిస్తారు. ఎంత మొత్తం అనేది చెప్పలేదు కానీ.. చెల్లింపులు మాత్రం ఉంటాయని.. జీవోలో చెప్పకనే చెప్పారు. ఆయా దేశాల్లో ఏపీకి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తారనే ఉంది కానీ.. ఆయన బాధ్యతలేమిటి.. ఎవరిని కలుస్తారు.. ఎవరిని సంప్రదిస్తారు… అసలు ఆయన ఏ పని చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఈ జీవో హఠాత్తుగా ఎందుకు బయటకు వచ్చిందో.. కూడా సస్పెన్స్ గానే ఉంది.
గత ఏడాది జూలై చివరిలో… సెర్బియాలో.. నిమ్మగడ్డను అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయడానికి కారణం గల్ఫ్ దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాను మోసం చేయడం. రస్ అల్ ఖైమా విజ్ఞప్తి మేరకే నిమ్మగడ్డను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ తర్వాతే.. ఈ నియామకం జరగడం.. చాలా కాలం పాటు రహస్యంగా ఉంచడంతో.. ఇప్పుడు.. ఈ ప్రత్యేక ప్రతినిధి విధులపై… అనేక రకాల సందేహాలు కలుగుతున్నాయి. అసలు నియామకం జరిగినప్పటి నుండి ఆయన ఏపీ కోసం ఏం పని చేశారు..? ఏ విధులు నిర్వహించారన్నది.. ? సీక్రెట్ గానే ఉంది.