ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లపై విచారణలే .. వర్కింగ్ డేస్‌లో హైలెట్ అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా.. హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. అవి చట్ట విరుద్ధమని చెప్పడానికి ప్రాధమిక సాక్ష్యాలు కూడా.. ఆయా పిటిషన్లర్లు తక్షణం సమర్పిస్తూండటంతో.. వాటిపై హైకోర్టులో విచారణలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలనే విషయం దగ్గర్నుంచి రాజధానిలో భూములును.. ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడం వరకూ.. ప్రభుత్వంపై.. వివిధ వర్గాలు వేసిన పిటిషన్లు దాదాపుగా యాభై వరకూ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై.. ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చు. ప్రభుత్వం అయినా.. రాజ్యాంగపరంగా.. చట్టపరంగా.. నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని ఉల్లంఘించేలా నిర్ణయాలు తీసుకుంటే.. దాని ద్వారా నష్టపోయేవారు లేదా.. ప్రజలు నష్టపోతారనుకుంటే.. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల ద్వారా ఇతరులు కోర్టును ఆశ్రయించవచ్చు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు.. రాజ్యాంగ, చట్ట వ్యతిరేక నిర్ణయాలన్నింటిపై కోర్టులో కేసులు పడ్డాయి. ఇంగ్లిష్ మీడియం సహా.. రాజకీయాలకు సంబంధం లేని అనేక అంశాలపైనా.. కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. ఇక రాజధానికి సంబంధించిన పిటిషన్లయితే.. పదుల సంఖ్యలో దాఖలయ్యాయి. వాటిని మూడు విధాలుగా విభజించి.. హైకోర్టు ధర్మాసనాలు విచారణ చేపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్.. సుబ్రహ్మణ్యం శ్రీరాం.. హైకోర్టులో ఆ బెంచ్‌కూ..ఈ బెంచ్‌కు మధ్య పరుగులు పెడుతున్నారు. ప్రతీ చోటా.. ఆయన ఎక్కువగా వినిపిస్తున్న వాదన.. మరిన్ని వివరాలు లేవు.. వాయిదా వేయండి అనే. ఈ కారణంగానే.. కేసులన్నీ వాయిదాలు పడుతున్నాయి. ప్రమాణపత్రాల దాఖలులోనూ.. ఏజీ వాయిదాలు కోరుతున్నారు. కొన్ని కేసుల విచారణకు ఆయన ఒక్కోసారి డుమ్మాకొట్టి వాయిదా పడేలా చేస్తున్నారు. ఎన్ని కేసులు నమోదవుతున్నా… ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేలా .. ఏజీ వాదనలు వినిపించలేకపోతున్నారు. ఏ విషయంలోనూ ఆయన సానుకూల ఫలితం తేలేకపోతున్నారు. చివరికి చంద్రబాబు పర్యటనపై పోలీసుల తీరును కూడా ఆయన సమర్థించలకపోయారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. జారీ చేసే జీవోలను ఏజీ అయినా ఎలా సమర్థించుకోగలరని.. ఇతర న్యాయవాదులు.. సానుభూతి చూపిస్తున్నారు.