రాజమౌళి సినిమా విడుదలవుతుందంటే.. మరో సినిమాను ఆ రోజు విడుదల చేయడానికి ఏ నిర్మాత ధైర్యం చేయడు. రాజమౌళీకున్న క్రేజ్ అలాంటిది. కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచీ ఒక్క ఫ్లాప్ లేకుండా, సినిమా సినిమాకు సక్సెస్ గ్రాఫ్ పెంచేసుకుంటూ సూపర్స్టార్లకు మించిన క్రేజ్‌ని సంపాదించాడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో రూపొందున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 8న విడుదల చేయనున్నట్టు డేట్ కూడా ప్రకటించేశారు. ఇక ఆ సినిమాకు పోటీగా మరో సినిమా విడుదల చేయడమంటే నిజంగా సాహసమే. పైగా ఆర్.ఆర్.ఆర్‌లో ఎన్టీయార్, చరణ్ హీరోలు. నందమూరి, మెగా కుటుంబ హీరోలు కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్.పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళీ తీస్తున్న సినిమాకావడంతో ఈ సినిమాపై హైప్స్ ఓ రేంజ్లో ఉన్నాయ్.
ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి ప్రకటనతో చాలామంది నిర్మాతలు వచ్చే సంక్రాంతిపై ఆశలు వదిలేశారు.. కానీ ఓ నిర్మాత మాత్రం సంక్రాంతి విషయంలో పెద్దగా భయపడుతున్నట్టు కనిపించడంలేదు. ఎన్ని సినిమాలొచ్చినా, సంక్రాంతికే వస్తాం.. అని తన యూనిట్‌తో బహాటంగానే చెబుతున్నాడట. ఆ నిర్మాత ఎవరోకాదు.. సూర్యామూవీస్ అధినేత ఏఎంరత్నం.
పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మాత. నిజానికి ఈ సినిమా దసరాకు అనుకున్నారు. కానీ దసరాకి ఈ సినిమా సిద్ధం చేయడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. దసరా మిస్ అయితే సంక్రాంతికి రావడంలో వెనుకాడం అని ఏఎం రత్నం సన్నిహితులతో చెడుతున్నాడట. దాంతో ఈసారి సంక్రాంతి వార్ గట్టిగానే ఉండేట్టు కనిపిస్తోంది. ఎన్ని సినిమాలనైనా మోసే కెపాసిటీ సంక్రాంతికి ఉంటుంది. ఈ రెండు సినిమాలూ తలపడితే సినీ అభిమానులకు కన్నుల పండుగే..