సీఏఏ చట్టాన్ని, ఎన్నార్సీని అమలు చేయవద్దని … వాటికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ముస్లింలు కోరుతూంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్పీఆర్.. అంటే.. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ట్విట్టర్లో ప్రకటించారు. ఇప్పటికే ఎన్పీఆర్ ఉంది. దీన్ని అప్డేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో వివరాలు ఇవ్వడం.. పౌరుల ఇష్టం. ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు..లేకపోతే లేదు. సీఏఏ చట్టం… మాత్రం.. దీనికి భిన్నం. పూర్తి వివరాలు.. సమర్పించాలి. ఓ రకంగా పూర్తి స్థాయిలో పౌరసత్వం నిరూపించుకోవాలి. ఎన్పీఆర్ను ఇప్పటికే అసోంలో అమలు చేశారు. దేశమంతా అమలు చేస్తామంటున్నారు. ముస్లింలు ప్రధానంగా..ఈ చట్టాలపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో..ఎన్పీఆర్ను కూడా చేపట్టాలని.. కేంద్రం నిర్ణయించడంతో.. ఇది కూడా అందులోనే భాగమని అనుకుంటున్నారు. దాంతో.. ఎన్పీఆర్ కూడా అమలు చేయకూడదనే డిమాండ్లు ముస్లిం వర్గాల నుంచి వస్తున్నాయి. అయితే..జగన్మోహన్ రెడ్డి మాత్రం.. సీఏఏ గురించి.. ఎన్నార్సీ గురించి.. ఒక్క మాట కూడా చెప్పకుండా.. కేవలం.. ఎన్పీఆర్ గురించి మాత్రమే ట్వీట్ చేశారు. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెబుతున్నారు. ఎన్పీఆర్లో ఉన్న నిబంధనలు సడలించాలని.. ప్రభుత్వాన్ని కోరుతామంటున్నారు. పార్లమెంట్లో సీఏఏ చట్టానికి అనుకూలంగా… వైసీపీ ఓటింగ్ లో పాల్గొంది.
ఇప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకే.. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా… సిటిజన్ షిప్ అమెండ్మెంట్ చట్టాన్ని, నేషనల్ రిజిస్ట్రి ఆఫ్ సిటిజన్‌షిప్‌ను వ్యతిరేకించకుండా.. కేవలం..జనాభా లెక్కల పట్టికను అప్ డేట్ చేసే.. ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామంటున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో.. చాలామందిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.