బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో రాహుల్‌పై కొంతమంది దాడి చేయడంతో ఈ విషయం కాస్తా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ వ్యవహారంపై రాహుల్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. ఇదంతా ఒక ఎత్తయితే… మీడియా ముందు మాట్లాడిన రాహుల్.. అనవసరంగా నోరు జారాడు. మీడియావాళ్లకు దొరికిపోయాడు.
రాహుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు రిపోర్టర్లకు కోపం తెప్పించాయి. మీరు పబ్ లకు వెళ్తుంటారా? అని అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ “మీరు బార్లకు వెళ్తారు.. నేను క్లబ్బులకు వెళ్తాను. తప్పేంటి” అన్నాడు. దాంతో మీడియావాళ్లకు కోపం వచ్చింది. “మా గురించి మీకెందుకు.. మేం అడిగినదానికి మాత్రమే సమాధానం చెప్పండి. అనవసరమైన విషయాలు చెప్పి.. కాంట్రవర్సీ కొని తెచ్చుకోవొద్దు” అంటూ పాత్రికేయులు కాస్త నచ్చజెప్పడంతో రాహుల్ గతుక్కుమన్నాడు. పబ్‌లో తనపై అనవసరంగా దాడి చేశారని, అందులో తన తప్పేం లేదని, తనని దుర్భాషలాడితే, తాను కూడా ప్రతిఘటించాల్సివచ్చిందని, తనపై దాడి చేసిన వాళ్లకు రాజకీయ పలుకుబడి ఉందని, అయితే తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు రాహుల్. అయితే ప్రెస్ మీట్లో రాహుల్ ఆటిట్యూడ్ కాస్త చర్చనీయాంశమైంది. తన భాష, యాటిట్యూడ్ సరిగా లేవని, మీడియా ప్రతినిధులే రాహుల్ ని మందలించాల్సివచ్చింది.