మాన్సాస్ ట్రస్ట్‌ను ఇతర మతం వారికి అప్పగించడం మంచి పద్దతి కాదని… దీని వల్ల సమస్యలు వస్తాయని.. ప్రభుత్వం తీసేసిన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. అశోక్ గజపతిరాజు వైద్య పరీక్షల కోసం ఢిల్లీలో ఉన్న సమయంలో హడావుడిగా… రహస్య జీవో ఇచ్చిన ప్రభుత్వం.. రాత్రికి రాత్రి ఆయనను తొలగించి.. ఆయన అన్న కుమార్తె సంచైతను చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేయించింది. అదే విధంగా సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో 105 ఆలయాలు ఉండటం… ట్రస్ట్‌కు రూ. లక్షా 30వేల కోట్ల విలువైన భూములు ఉండటంతో ఈ వ్యవహారం వివాదాస్పదమయింది. దీనిపై అశోక్ గజపతిరాజు స్పందనేమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. వైద్య పరీక్షల తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అశోక్‌గజపతిరాజు.. కోటలో మీడియా సమావేశం పెట్టారు.
సంచయిత వేర మతం అనే అంశాన్ని అశోక్ గజపతిరాజు బయటపెట్టారు. సంచైత.. వాటికన్ సిటీకి వెళ్లి క్రీస్తు ప్రార్థనల్లో పాల్గొనడం.. క్రిస్మస్‌ను వేడుకగా జరుపుకోవడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంచయితతో పాటు ఆమె తల్లి కూడా క్రిస్టియానిటీనే అనుసరిస్తారని.. అశోక్ నేరుగా చెప్పినట్లయింది. మిస్టర్ కూల్ అశోక్ గజపతిరాజు.. తాజా పరిణామాలపై .. ఏ మాత్రం ఆవేశ పడతారు. ఆయన తనదైన పద్దతిలోనే సమాధానం చెప్పారు. ప్రభుత్వం జీవో ఇచ్చి… సంచైతకు… పదవి అప్పగించిందని.. ఆ జీవో ఎంటో తనకు ఇంత వరకూ అందలేదన్నారు. అంత రహస్యంగా జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అది అందినత తర్వాత న్యాయపోరాటం చేస్తామన్నారు. అసలు చైర్మన్‌గా తనను తీసేయడానికి తాను చేసిన తప్పేమిటో చెప్పాల్సి ఉందన్నారు. ప్రభుత్వ తీరు వింతగా ఉందన్నారు. ఇలాంటి వ్యవహారాల వల్లే రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, ప్రాజెక్టులు రావడం లేదన్నారు. పిల్లల భవిష్యత్ కోసమే ఆ ట్రస్ట్ ఏర్పాటు చేశారని చెప్పిన అశోక్ గజపతిరాజు.. సంచైత .. ఎలా న్యాయ చేయగలరని ప్రశ్నించారు.
ట్రస్ట్ భూములపై ఇతరులు కన్నేశారని.. అశోక్ గజపతిరాజు చాలా రోజుల క్రితమే గుర్తించారు. ఆయన ట్రస్ట్ చైర్మన్‌గా ఉంటే.. ఎవరూ భూముల్లో అడుగుపెట్టలేరు. పెట్టనివ్వలేదు కూడా. చాలా సింపుల్ లైఫ్ స్టైల్‌ను ఇష్టపడే అశోక్ గజపతి రాజు ఇప్పటికీ విజయనగరంలో నానో కారులోనే తిరుగుతారు. ఆడంబరాలకు వెళ్లరు. రాజకీయంగా తనను టార్గెట్ చేసి.. ట్రస్ట్ చైర్మన్ నుంచి తొలగించారని తెలిసినా.. అశోక్ .. ప్రభుత్వంపై రాజకీయ విమర్శలే చేశారు కానీ.. ఆవేశపడలేదు.