లెఫ్ట్ పార్టీల్లో సీపీఎం టీడీపీతో నడిచేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ సీపీఐ మాత్రం రెడీ అయింది. దీంతో.. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. చంద్రబాబును.. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కలిశారు.బలమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశంపై ఇరుపక్షాలు జిల్లా స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. పొత్తులన్నీ ఎక్కడివక్కడ సర్దుబాటు చేసుకోవాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే నేతలకు సమాచారం పంపింది. పలు గ్రామాలలో ఎంపిటీసీ పదవి ఒకరికి, జడ్పీటీసీ పదవి మరొకరికి, సర్పంచ్ పదవి ఒకరు పంచుకునే విధంగా కూడా అవగాహనలు కుదురుతున్నాయి.
స్థానిక పరిస్థితుల ఆధారంగా పొత్తుల పై నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక నేతలకు తెలుగుదేశం హై కమాండ్ అప్పగించింది. రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాలలో సిపిఐకి బలంగా ఉన్న ప్రాంతాలలో పొత్తులు కుదుర్చుకోవాలని ఆ పార్టీ టిడిపి నేతలతో సంప్రదింపులు జరుపుతుంది. చంద్రబాబు పార్టీ జాతీయ కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్ లో కూర్చుని నిరంతరం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. జరుగుతోంది స్థానిక ఎన్నికలు కాబట్టి.. రాష్ట్ర స్థాయి పొత్తులకు అవకాశం లేదు.
విజయవాడ లాంటి చోట్ల… కమ్యూనిస్టలకు కొంత బలం ఉంది. అలాంటి చోట్ల.. సీపీఐతో పొత్తు పెట్టుకుని.. ఒకటి, రెండు కార్పొరేటర్ సీట్లు కేటాయిస్తే.. వరికి ఉన్న ఓటు బ్యాంక్ మొత్తం తమకు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం జనసేనతో కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. ఇలాంటి పొత్తులు ఎంత మేర పని చేస్తాయో.. వేచి చూడాల్సిందే..!