మేం అల్లాటప్పా మాటలు చెప్పం.. చెప్పినట్లు చేస్తామని ప్రకటించుకున్న అధికార పార్టీ నేతలు.. తాము స్పష్టంగా చెప్పిన విషయాల్లోనూ.. యూటర్న్ తీసుకుంటున్నారు. పన్నెండో తేదీ నుంచి 29వ తేదీ వరకూ మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లుగా మంత్రి అనిల్ కుమార బహిరంగంగా ప్రకటించారు. అయితే.. ఆ విషయంపై ఒక్క రోజులోనే యూటర్న్ తీసుకున్నారు. తాము నియంత్రిస్తామని చెప్పాం కానీ.. దుకాణాలు మూసివేస్తామని చెప్పలేదని అనడం ప్రారంభించారు. ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది.. ప్రభుత్వమే.. మద్యం, డబ్బు పంపిణీ ఉండకూడదని పట్టుదలగా ఉంది. ఇలాంటి సమయంలో.. అమ్మకాలు నిలిపివేస్తుందని అందరూ అనుకున్నారు.
అందరి నుంచి అదే తరహా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం.. నిజంగానే మద్యం దుకాణాలను ఎన్నికలయ్యే వరకూ నిలిపివేస్తుందని అందరూ అనుకున్నారు. మంత్రి అనిల్ కుమార్ ప్రకటనతో.. అది నిజమయింది అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు మూసివేయకూడదనే ఆలోచనలో ఉంది. మంత్రి ప్రకటనతో.. ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మంత్రులు చెప్పినా.. తమకు అధికారిక ఆదేశాలు రాలేదని కలెక్టర్లు అంటున్నారు. సహజంగా… పోలింగ్ జరిగే చోట… ప్రచారం ముగిసిన రోజు నుంచి మద్యం దుకాణాలు మూసేస్తారు. ఈ సారి కూడా అదే పద్దతిని పాటిస్తున్నారు.
అంతే తప్ప.. మద్యం కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. వాలంటీర్లు, మద్యం దుకాణాల్లో పని చేసేవారు.. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఉండటంతో.. తమ ఎన్నికల అవసరాలకు తగ్గట్లుగా వారు.. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికైనా… ప్రభుత్వంమద్యం దుకణాలను మూసివేస్తుందని అనుకున్నా.. అతి అత్యాశేనని… ఆర్భాటపు ప్రకటనలేనని తేలిపోయింది.