స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసిపి, టీడీపీ ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలుగు దేశం పార్టీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న పై వైసిపి వర్గీయులు దాడి చేసి వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే..
మాచర్ల లో టిడిపి నాయకులు నామినేషన్ చెయ్యకుండా వైఎస్ఆర్సిపి వర్గీయులు అడ్డుకుంటూ ఉండడంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వం పరిస్థితిని సమీక్షించడానికి బుద్ధా వెంకన్న, బోండా ఉమ లను మాచర్ల పంపింది. అయితే మాచర్ల వెళ్లిన బోండా ఉమా, బుద్ధా వెంకన్న ల ను అడ్డుకునేందుకు వైఎస్ ఆర్ సిపి వర్గీయులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి కార్లు అడ్డుకుని వాహనాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన అనంతరం ఉమా మాట్లాడుతూ అక్కడ పరిస్థితి చూస్తే బతికి బయట పడతానని అనుకోలేదు అని వ్యాఖ్యానించారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళితే అక్కడ ఎవరూ లేరని ఆయన అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి.