దాడులు.. దౌర్జన్యాలే స్థానిక ఎన్నికల్లో అస్త్రాలుగా మారిపోయాయి. పెద్ద నేతలపై హత్యాయత్నాలు కూడా జరుగుతున్నాయి. పల్నాడు వెళ్లిన బొండా ఉమ, బుద్దా వెంకన్నలపై జరిగిన హత్యాయత్నం దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పల్నాడులో అత్యంత భయంకర వాతావరణం ఉందన్న … పోలీసులపైనా వైసీపీ నేతలు దాడులు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతిని ఖండించాల్సిన వైసీపీ నేతలు.. అసలు… బొండా ఉమ, బుద్దా వెంకన్ పల్నాడు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. వారు పల్నాడు వెళ్లినందుకే దాడి జరిగిందన్నట్లుగా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు కూడా ప్రకటనలు చేస్తున్నారు.
పోలీసులను చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారని గత ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారో తెలుసంటూ.. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. భయపెట్టి అరాచకం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని బొత్స చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు.. పోలీసులపై దాడులకు దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులను పోలీసులు పట్టుకోలేదు. వారు యధేచ్చగా పోలీసులపైనా దాడులకు దిగారు. వైసీపీ నేతలు.. దాడులకు తెగబడుతున్నా.. కొంత మంది పోలీసులు వారికి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పర్యటన వివరాలను పోలీసులే వైసీపీ నేతలకు ఎప్పటికప్పుడు చెబుతూ.. ఎక్కడికెళ్లినా దాడులకు పులికొల్పారని బొండా ఉమ ఆరోపిస్తున్నారు.
మాచర్లలో పట్ట పగలే రాళ్లు, పెద్ద పెద్ద కర్రలతో దుండగులు దాడిచేయడం అమానుషమని… ఏపీలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్న అభిప్రాయం.. ఇతర పార్టీల నేతల్లో వస్తోంది. ఈ ఘటనపై పోలీసులు పెద్దగా స్పందించిన దాఖలాలు కూడా ఈసీ కూడా.. స్పందించలేదు. వ్యవస్థలన్నీ.. నిద్రాణంగా ఉండిపోతున్నాయన్న అభిప్రాయం.. సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.