మెల్లమెల్లగా కమర్షియల్ కథల నుంచి – ప్రయోగాల బాట పడుతున్నారు అగ్ర కథానాయికలు. నయనతార ఎప్పుడో ఈ రూటులోకి వచ్చేసింది. సమంత కూడా సరికొత్త కథలవైపే దృష్టి పెడుతోంది. కీర్తి సురేష్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోంది. కాజల్ కూడా ఇప్పుడు ఇదే పంథా ఫాలో అవుతోంది. నాని తెరకెక్కించిన `అ`లో ఓ విలక్షణమైన పాత్ర పోషించింది కాజల్. లేడీ ఓరియెంటెడ్ కథలవైపు దృష్టి పెట్టింది. ఇండియన్ 2 లాంటి కమర్షియల్ సినిమా చేస్తూనే – నటిగా తనదైన మార్క్ చూపించడానికి తహతహలాడుతోంది.
తాజాగా ఓ సినిమాకి ఓకే చెప్పింది కాజల్. ప్రముఖ నృత్య దర్శకురాలు బృంద తొలిసారి మెగా ఫోన్ పట్టిన చిత్రానికి కాజల్ కథానాయిక. ఇదో హీరోయిన్ సెంట్రిక్ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి పట్టాలెక్కబోతోంది. వీలైతే బాలీవుడ్ లోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు. నాయికా ప్రాధాన్య చిత్రం అంటే.. కష్టాలూ, కన్నీళ్లూ అనుకుంటారు. పైగా ఓ మహిళ దర్శకత్వం వహిస్తోంది. కాబట్టి.. ఆ తరహా కథ అని ఫిక్సవ్వడం ఖాయం. కానీ.. ఈ కథ మాత్రం అలా ఉండదట. అందరినీ ఆశ్చర్యపరిచే కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. `అ` టైపులోనే క్లైమాక్స్ ట్విస్టు ఆశ్చర్చ పరుస్తుందట. ఆ ట్విస్టు నచ్చే కాజల్ ఈ కథ ఓకే చేసిందని టాక్. మొత్తానికి కాజల్ కూడా ప్రయోగాల బాట పట్టేసింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..?