శేఖర్ కమ్ముల అమ్మాయిల పక్షపాతి. ఆయన సినిమాల్లో కథానాయికలకు స్ట్రాంగాతి స్ట్రాంగు పాత్రలుంటాయి. ఆనంద్, గోదావరిలో కమలిని ముఖర్జీ పాత్రల్ని చూసుకుంటే ఆ విషయం అర్థమవుతుంది. ఫిదాలో అయితే ఆ ప్రేమ ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మార్కులన్నీ సాయి పల్లవి పట్టుకెళ్లిపోయింది. ఆ సినిమాలో వరుణ్ తేజ్ కూడా చక్కగా నటించినా – సాయి పల్లవి ముందు అది ఆవగింజలా మారిపోయింది.
ఇప్పుడు లవ్ స్టోరీలోనూ అదే జరుగుతోందట. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ఇది. శేఖర్ కమ్ముల చిత్రం, అందులోనూ ఫిదా తరవాత ఆయన్నుంచి వస్తున్న సినిమా. అందుకు తోడు సాయి పల్లవి కథానాయిక. అందుకే ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే శేఖర్‌కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార్ట. మరోసారి హీరోయిన్ డామినేషన్ ఉన్న కథని శేఖర్ కమ్ముల రాసుకున్నారని, చైతూని అన్నిరకాలుగా సాయి పల్లవి డామినేట్ చేసేసిందని, సినిమా చూసొచ్చాక శేఖర్ కమ్ముల, చైతూల కంటే.. సాయి పల్లవి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారని ఇన్సైడ్ టాక్. హీరోయిన్ పాత్ర డామినేట్ చేస్తే చైతూ వైపు నుంచి కూడా పెద్దగా కంప్లైంట్స్ ఉండకపోవొచ్ఉ. ఎందుకంటే… నాగ చైతన్య సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. ఏం మాయ చేశావే, 100 % లవ్, మజిలీ… ఇలా చైతూ కెరీర్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి… చైతూకి ఇదో సెంటిమెంట్‌గా మారొచ్చు.