కరోనా ప్రభావం మన దగ్గర లేదు, కానీ ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా సోకిన వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడన్నారు. మరో వ్యక్తికి చికిత్స జరుగుతోందన్నారు. మనదేశంలో ఇంతవరకూ 83 మందికి మాత్రమే కరోనా సోకిందనీ, వారిలో 17 మంది విదేశీయులు ఉన్నారన్నారు. వీళ్లలో ఇద్దరు మాత్రమే చనిపోయారనీ, వీరంతా విదేశాల నుంచి వచ్చినవారే అన్నారు ముఖ్యమంత్రి. విదేశాల నుంచి వస్తున్నవారిపై శంషాబాద్ విమానాశ్రయంలో గట్టి నిఘా పెట్టామన్నారు.
శనివారం అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకూ జనాలు ఎక్కువగా గుమ్మిగూడే ప్రాంతాలను నిర్మూలించాలని నిర్ణయించామన్నారు కేసీఆర్. అన్ని రకాల విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు, ప్రత్యేక వేసవి క్యాంపులు.. ఇలాంటివన్నీ శనివారం రాత్రి నుంచే బంద్ చెయ్యాలన్నారు. అయితే, విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలూ యాథావిధిగా జరుగుతాయనీ, ముందుగా ప్రకటించిన షెడ్యూళ్లలో ఎలాంటి మార్పు లేదన్నారు. కల్యాణ మంటపాలను కూడా మూసెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే, ఈ నెలాఖరు వరకూ ముందుగా నిర్ణయించుకున్న పెళ్లిళ్లలకు మాత్రమే అనుమతిస్తామనీ, అది కూడా కేవలం 200 మందికి మించి బంధువర్గం మంటపాల్లో ఉండకూడదన్నారు. ఈ నెలాఖరు తరువాత పెళ్లిళ్లకు మంటపాలను ఇవ్వొద్దనీ, ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని ఫంక్షన్ హాళ్ల యజమానులను కేసీఆర్ హెచ్చరించారు.
సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులను మూసేస్తున్నారు. అయితే, నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో షాపింగ్ మాళ్లు, సూపర్ మార్కెట్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రజలకు వెళ్లొద్దని సీఎం సూచించా