విజయసాయిరెడ్డి విశాఖ కార్పొరేషన్ ను వైసీపీ ఖాతాలో వేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కార్యక్షేత్రం విశాఖ. ప్రతీ వ్యవహారాన్ని తన కనుసన్నల్లో ఉండేలా చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలనుకుంటున్నారు. అక్కడ నాలుగు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించారు. విశాఖకు మహర్దశ తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఇలాంటి సమయంలో.. ఎన్నికల బాధ్యత ఆయనపై పడింది. దగ్గరుండి అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 85 చోట్ల గెలిపిస్తే.. విశాఖను కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేస్తామనే నినాన్ని ప్రజల ముందు వినిపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ హడావుడి చేయడం లేదు. కానీ.. చాపకింద నీరులా ని పూర్తి చేసుకుంటోంది. నామినేషన్లు ఉపసంహరణ లాంటి వ్యూహాలు అమలు చేయకుండా.. వార్డుల్లో ఒకటికి మూడు నామినేషన్లు వేయించింది. టిడిపి నుండి అత్యధికంగా 380 నామినేషన్లు దాఖలయ్యాయి. బెదిరిపుల రాజకీయంలో.. ఎవరైనా వెనక్కి తగ్గుతారేమోనన్న అంచనాతో.. బీఫామ్‌లతో చివరి వరకూ.. వ్యూహాలనుఅమలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, నాలుగువైపుల టీడీపీ ఎమ్మెల్యేలు ఉండటం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ క్యాడర్ నమ్మకంతో ఉంది. ఇప్పటికే భూకబ్జాలు పెరిగిపోయాయని.. ఇక జీవీఎంసీలోనూ వైసీపీ వస్తే.. తమ ఆస్తులకు రక్షణ ఉండదేమోనన్న భయం.. ప్రజల్లో ఉందని.. టీడీపీ నేతలు భావిస్తున్నారు.
బంధుగణానికి సీట్లివ్వవద్దని… హైకమాండ్ ఆదేశించినా.. దాన్ని కొంత మందికే పరిమితం చేశారు. మేయర్ సీటుపై కన్నేసి.. మంత్రి ఆవంతీ అతని కుమార్తెను, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అతని కుమారుడిని, సమన్వయకర్తలు వారి బంధుగణంను రంగంలోకి దించారు. బిజెపి, జనసేన, కాంగ్రెస్, వాపక్షపార్టీలు తమ ఆభ్యర్దులను పోటిలో పెట్టాయి. చాలా ప్రాంతాల్లో బలమైన స్వతంత్ర ఆభ్యర్దులు ఉన్నారు. వీరు రెండు పార్టీల్లో ఎదో పార్టీని దెబ్బకోట్టే ఆవకాశం ఉంది. అన్నింటినీ విజయసాయిరెడ్డి.. సమన్వయం చేసి.. విశాఖ పీఠాన్ని వైసీపీ కి పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు.