వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కండిషనల్ బెయిల్‌పై ఉన్నారని.. వారు రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించడమేమిటని.. వారి బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎస్ఈసీ ఎన్నికల వాయిదా ప్రకటన చేసిన తర్వాత విజయసాయిరెడ్డి… రమేష్ కుమార్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవి బెదిరించేలా ఉన్నాయి. విజయసాయిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎస్ఈసీ కార్యాలయం దగ్గర భద్రతను పెంచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్ఈసీని ఏకవచనంతో సంబోధిస్తూ.. ప్రెస్మీట్లో మాట్లాడారు. దీనిపై.. తెలుగుదేశం పార్టీ కొత్త వాదన ప్రారంంభించారు.
జగన్, విజయసాయిరెడ్డి ఇ్దదరూ.. ఎస్ఈసీ రమేష్‌ను భయపెడుతున్నారని అంటున్నారు. బెయిల్‌పై బయట ఉన్న సీఎం జగన్ కూడా వ్యవస్థలను బెదిరిస్తున్నారని .. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగా టీడీపీ.. జగన్, విజయసాయిల ఘాటు ప్రకటనల అంశాన్ని తెరపైకి తెస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ హైకోర్టులో.. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై వేసిన కౌంటర్లో… బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారని.. ఆయనకు మినహాయింపు ఇవ్వవద్దని పేర్కొన్న విషయం బయటకు వచ్చింది. దీనిపై ఏప్రిల్ తొమ్మిదో తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది.
ఈ లోపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా హాజరు కావడం లేదు. వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొడుతున్నారు. ఈ మధ్య కాలంలో.. సహ నిందితులకు పదవులు ఇస్తూ.. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ..సాక్షుల్ని కూడా ప్రభావితం చేస్తున్నారన్న వాదనను టీడీపీ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన జగన్ పై రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ వచ్చిన టీడీపీ అనూహ్యంగా… జగన్ బెయిల్ షరతుల ఉల్లంఘన అంశం తెరపైకి తీసుకు రావడం.. వైసీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.