రాజ్యాంగ వ్యవస్థల ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ముందు ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం..సివిల్ సర్వీస్ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలును చీఫ్ సెక్రటరీ అమలు చేయకపోగా.. ఎన్నికలు నిర్వహించాలంటూ.. నేరుగా ఎస్ఈసీకే లేఖ రాశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ.. ఎస్ఈసీకీ.. సీఎస్ నీలం సాహ్ని లేఖ రాయడం … అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నేరుగా ఈసీకే లేఖ రాయడం.. ఆలిండియా సర్వీసు నిబంధనలకు వ్యతిరేకం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. సీఎస్ పూర్తిగా… ఎన్నికల సంఘం ఆదేశాలతో పని చేయాల్సి ఉంటుంది. సీఎస్.. సొంతంగా రాసినా.. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాసినా.. అది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనేనని.. ఎవరైనా డీవోపీటీకి ఫిర్యాదు చేస్తే.. సీఎం నీలం సాహ్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయం ఉన్నతాధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోగా.. ఎదురుగా.. ఆ నిర్ణయం మార్చుకోవాలని సలహాలివ్వడం.. అసాధారణమేనని ఐఏఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు పలువురు అధికారుల్ని బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. తాము బదిలీ కాలేదని..ఎస్ఈసీకి అంత సీన్ లేదని చెప్పడానికి బదిలీ అయిన ఆయా కలెక్టర్లు.. ప్రెస్మీట్లు పెట్టి..కరోనా జాగ్రత్తల గురించి ప్రకటనలు చేశారు. ఇవన్నీ.. రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించడమేనని.. అంతిమంగా.. చీఫ్ సెక్రటరీనే బాధ్యులవుతారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే… న్యాయవ్యవస్థను కూడా.. ఏపీ సర్కార్ లెక్క చేయడం లేదు.
ఏ ఆదేశాలు పాటించడం లేదు. రంగుల విషయంలోనూ ఇతర అంశాల్లోనూ… హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున పనులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ చీఫ్ సెక్రటరీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల విషయంలో… ఎన్నికల కమిషన్ను కూడా ధిక్కరిస్తూ ఉండటంతో.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని… ఈ వ్యవహారం మొదటగా.. బలయ్యేది చీఫ్ సెక్రటరీనేనన్న ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో నడుస్తోంది.